నంద్యాల పంచాయితీపైనా చంద్రబాబు దృష్టి సారించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బ్రహ్మానంద రెడ్డి అభ్యర్ధిత్వాన్ని ఏవీ సుబ్బారెడ్డి, శ్రీధర్ రెడ్డివ్యతిరేకిస్తున్నారు. బ్రహ్మానంద రెడ్డికి టికెట్ ఇస్తే సహకరించేదే లేదని ఈ ఇద్దరూస్పష్టం చేయడంతో వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చేందుకు అధినేత యత్నించారు. బాపట్ల అసెంబ్లీకి అభ్యర్ధి ఎవరన్న విషయంపైనాఅధినేత దృష్టి సారించారు.
గుంటూరు జిల్లాలో ఇప్పటి వరకూ ఖరారైన అభ్యర్ధుల్లో కాపు సామాజిక వర్గానికి అవకాశం దక్కలేదు.ఈ కారణంతో.. బాపట్లకు సతీష్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తాడికొండ నియోజకవర్గంపైనా అధినేత పునరాలోచనలో పడినట్లు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రావణ్‌కే టికెట్ కేటాయించాలని స్థానిక నేతలు, రైతుల నుంచి ఒత్తిడి పెరుగుతుండడంతో సమన్వయ కమిటీ నాయకులతో మరోమారు స్క్రీనింగ్ కమీటీ చర్చించింది.
నెల్లూరు రూరల్ అభ్యర్ధి ఆదాల ప్రభాకర్ రెడ్డి వైకాపాకు వెళ్లిన కారణంగా.. ఆ స్థానం నుంచి నెల్లూరు అర్బన్ టిక్కెట్ ఆశించి భంగపడ్డ అజీజ్‌తో పాటు పెళ్లకూరు శ్రీనివాసుల రెడ్డి పేరును పరిశీలిస్తున్నారు. గత అర్ధరాత్రి మూడో జాబితా విడుదల చేస్తారని అంతా భావించినా... దాదాపుగా తెల్లవారే వరకూ చర్చల మీద చర్చలుకొనసాగాయి. ఈ రోజు పెండింగ్ నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారయ్యే అవకాశం ఉంది.
ఇవీచదవండి