వైకాపా ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని బాపట్ల నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జి వేగేశ్న నరేంద్రవర్మ ఆరోపించారు. వైకాపా ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలు పేరుతో.. వేగేశ్న ఫౌండేషన్ కార్యాలయంలో కరపత్రాలు విడుదల చేశారు.
భవన నిర్మాణ రంగం.. ప్రస్తుత వైకాపా ప్రభుత్వ చర్యలతో కుదేలైందని నరేంద్రవర్మ దుయ్యబట్టారు. అన్న క్యాంటీన్లు మూసివేసి బడుగు బలహీన వర్గాల పొట్ట కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: