ETV Bharat / state

'ఫోన్ ట్యాపింగ్​ను అత్యాచారంతో పోల్చటం దుర్మార్గం' - తెదేపా ఎమ్మెల్సీ సంధ్యారాణి న్యూస్

ఫోన్ ట్యాపింగ్ విషయంలో హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని తెదేపా ఎమ్మెల్సీ గుమ్మడి సుధారాణి డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి.. అలా మాట్లాడటం సరికాదని హితువు పలికారు.

tdp mlc sandhyarani
ఎమ్మెల్సీ గుమ్మడి సుధారాణి
author img

By

Published : Aug 19, 2020, 8:19 AM IST

ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని హోంమంత్రి సుచరిత అత్యాచారంతో పోల్చటం దుర్మార్గమని.. తెదేపా ఎమ్మల్సీ గుమ్మడి సుధారాణి మండిపడ్డారు. బాధ్యాతాయుతమైన పదవిలో ఉండి.. అలా మాట్లాడటం సరికాదని, హోంమంత్రి నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. చట్ట వ్యతిరేకమైన ఫోన్ ట్యాపింగ్​కు వైకాపా ప్రభుత్వం పాల్పడిందని సంధ్యారాణి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్​పై ప్రధానికి చంద్రబాబు లేఖ రాస్తే.. వైకాపా ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బాలికపై 12 మంది అత్యాచారం చేస్తే.. హోంమంత్రి ఎందుకు స్పందించలేదని నిలదీశారు. రాష్ట్రంలో ప్రతిరోజు దాడులు, నేరాలు జరుగుతున్నా.. చర్యలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని ఆమె విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: శిరోముండన బాధితుడి దస్త్రం సామాజిక న్యాయశాఖకు బదిలీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.