ఆత్మకూరు వెళ్లకుండా చేయటంతో పోలీసుల తీరును నిరసిస్తూ ప్రజా ప్రతినిధులంతా ధర్నాకు దిగారు. మాజీ మంత్రి కేఎస్ జవహర్, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు ఉండవల్లిలో సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్లపై బైఠాయించారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత తమ తెలుగుదేశం కార్యకర్తలపై దాడులు పెరిగాయని, దళితులను రక్షించుకునే బాధ్యత తమపై ఉందని, వారికి అండగా నిలిచేందుకు వెళ్తున్న తమను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారన్నారు. వైకాపా ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలం చెందిందని, ప్రజాసంక్షేమంపై దృష్టి పెట్టకుండా కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నరాని నేతలు విమర్శించారు. నిరసన చేస్తున్న నేతల్ని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్కి తరలించారు.
ఇదీ చూడండి :