ఎస్సీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలనీ కోరుతూ... ఈ నెల 5న రిలే నిరాహార దీక్ష చేపడతామని తెదేపా రాష్ట్ర కార్యదర్శి మానుకొండ శివప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలో దళిత ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైకాపా... దళితుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తుందన్నారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపైన కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ లకు కేటాయించిన నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. పెదకూరపాడులో ఎస్సీ భూములను ఇళ్ల స్థలాలకు ఇవ్వాలని చూడటం హేయమైన చర్యని మండిపడ్డారు.
ఇదీ చూడండి