అమరావతి రైతులను విమర్శించే మంత్రులు మళ్లీ అసెంబ్లీలోకి అడుగుపెట్టరని తెదేపా మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు. పరిపాలన రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ మందడంలో రైతులు చేస్తున్న దీక్షకు పుల్లారావు, గుంటూరు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మద్దతు ప్రకటించారు. రైతులతో కలిసి అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు.
భూములు ఇచ్చిన రైతులను మోసం చేస్తే దేశంలో ప్రాజెక్టులకు ఎక్కడా స్థలాలు దొరకవని పుల్లారావు అన్నారు. రైతులు చేస్తున్న పోరాటానికి న్యాయస్థానాల్లో వారు ఆశించిన ఫలితాలు దక్కుతాయని తెనాలి శ్రావణ్ కుమార్ చెప్పారు.
ఇదీ చదవండి: విషాదం: నాటు బాంబు నోట్లో పేలి ఆవు మృతి