TDP Leaders on Chandrababu Health and Security: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్యం, భద్రతపై రాజమండ్రి జైలులో పెద్ద కుట్ర జరుగుతోందని టీడీపీ ఆరోపించింది. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆ పార్టీ నేతలు శ్రావణ్‌కుమార్, ధూళిపాళ్ల నరేంద్ర డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ధూళిపాళ్ల.. చంద్రబాబు ఆరోగ్యం, భద్రతపై తెలుగుజాతి ఆందోళనలో ఉందని పేర్కొన్నారు. జైలు అధికారులు చంద్రబాబు ఆరోగ్యంపై సరైన సమాచారం ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Concern Over Chandrababu Health and Security భద్రత గురించి చంద్రబాబు లేఖపై కుటుంబ సభ్యుల ఆందోళన..
చంద్రబాబును పరీక్షించి వైద్యులు ఇచ్చే నివేదికలను వెంటనే జడ్జికి ఇవ్వట్లేదని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే జైలు అధికారులు చంద్రబాబు వైద్య నివేదికలు జడ్జికి ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నారని ఆయన అన్నారు. వైసీపీ సానుభూతిపరులను రాజమండ్రి జైలులో వైద్యులుగా నియమించారన్న ఆయన.. మంత్రి సురేశ్ వియ్యంకుడు బాజీ వైద్య అధికారిగా ఉన్నారని పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై తప్పుడు వైద్య నివేదికలు ఇస్తున్నారని మండిపడ్డారు. తీవ్ర నేరాలు చేసినవారు చాలామంది రాజమండ్రి జైలులో ఉన్నారన్న ఆయన.. చంద్రబాబు నాయుడు చనిపోతారని వైసీపీ ఎంపీలు బాహాటంగా చెబుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తన లేఖలో ప్రస్తావించిన అంశాలన్నీ నిజాలేనని, జైలు అధికారులు కూడా లేఖలోని అంశాలు నిజమని చెప్పారని పేర్కొన్నారు.
చంద్రబాబు అరెస్టై 50 రోజులు గడుస్తున్నా.. రాజమహేంద్రవరం జైలుపై డ్రోన్ ఎగరేసిన వారు ఎవరో ఇప్పటివరకూ గుర్తించలేదని ఆయన మండిపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. దీంతోపాటు ఒక ఖైదీ బటన్ కెమెరాతో జైలులోకి రావడం జైలు అధికారుల భద్రతా వైఫల్యమన్న ఆయన.. గంజాయి రవాణా చేసే వ్యక్తి బటన్ కెమెరా పెట్టుకుని లోపలకు ఎలా వస్తారు? అని ప్రశ్నించారు. వైసీపీ సోషల్ మీడియా ఇంఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డి కోసమే చంద్రబాబు జైలు లోపలి విజువల్ తీశారని ఆరోపించారు. జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ రెడ్డి ఆర్థికమంత్రి బుగ్గనకు బంధువని తెలిపారు. చంద్రబాబు అరెస్టుకు ముందు రవికిరణ్‌రెడ్డిని రాజమహేంద్రవరానికి బదిలీ చేశారని పేర్కొన్నారు.
MP Rammohan Naidu on Chandrababu Arrest: 'చంద్రబాబుకు అనుకూలంగా త్వరలో సుప్రీం తీర్పు రావొచ్చు'
"టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్యం, భద్రతపై రాజమండ్రి జైలులో పెద్ద కుట్ర జరుగుతోంది. చంద్రబాబు అరెస్టయి 50 రోజులు గడుస్తున్నా.. రాజమహేంద్రవరం జైలుపై డ్రోన్ ఎగరేసిన వారు ఎవరో ఇప్పటివరకూ గుర్తించలేదు. ఈ విషయంలో ప్రభుత్వ పెద్దల హస్తం ఉంది. ఒక ఖైదీ బటన్ కెమెరాతో జైలులోకి రావడం భద్రతా వైఫల్యం. జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్‌రెడ్డి ఆర్థికమంత్రి బుగ్గనకు బంధువు. చంద్రబాబు అరెస్టుకు ముందు రవికిరణ్‌రెడ్డిని రాజమహేంద్రవరానికి బదిలీ చేశారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి జైలు అధికారులు సరైన సమాచారం ఇవ్వట్లేదు." - ధూళిపాళ్ల నరేంద్ర, టీడీపీ సీనియర్ నేత