ETV Bharat / state

'రాష్ట్రంలో జైళ్లు వైకాపా నాయకుల కనుసన్నల్లో పనిచేస్తున్నాయి'

రాష్ట్రంలో పోలీసులు, జైళ్లు సైతం ప్రభుత్వం కనుసన్నల్లోనే నడుస్తున్నాయని తెదేపా నేతలు ఆరోపించారు. గుంటూరు జిల్లా జైలులో ఉన్న రాజధాని రైతులను పరామర్శించేందుకు వెళ్లిన దేవినేని ఉమ, ప్రత్తిపాటి పుల్లారావు, జీవీ ఆంజనేయులుకు చేదు అనుభవం ఎదురైంది. జైలు అధికారులు వీరిని జైలు లోపలికి అనుమతించకుండా రెండు గేట్ల దూరంలో ఉండి మాట్లాడాలని చెప్పారు. దీనిపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

tdp leaders fires on ysrcp
జైలులో ఉన్న రాజధాని రైతులకు తెదేపా నేతలు పరామర్శ
author img

By

Published : Feb 27, 2020, 5:28 PM IST

జైలులో ఉన్న రాజధాని రైతులకు తెదేపా నేతలు పరామర్శ

రాష్ట్రంలో జైళ్లు సైతం వైకాపా నాయకుల కనుసన్నల్లోనే పనిచేస్తున్నాయని తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. గుంటూరు జిల్లా జైలులో ఉన్న రాజధాని రైతులను పరామర్శించేందుకు దేవినేని ఉమ, ప్రత్తిపాటి పుల్లారావు, జీవీ ఆంజనేయులతో కలిసి వెళ్లారు. అయితే జైలు అధికారులు.. రైతులతో మాట్లాడేందుకు జైలు లోపలికి అనుమతించకుండా.... రెండు గేట్ల దూరంలో ఉండి మాట్లాడాలని చెప్పారు. దీనిపై తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జైలులో రైతులను చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు తమకు అనుమానంగా ఉందని.. అందుకే రైతులను చూడనీయకుండా అధికారులు అడ్డుకుంటున్నారని తెదేపా నేతలు ఆరోపించారు. జైలు అధికారుల తీరుపై కోర్టుకు వెళ్తామన్నారు.

ఇదీ చదవండి:

వాహనం దిగి నడుస్తూ వెళ్లిన చంద్రబాబు.. కానీ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.