రాష్ట్రంలో ఐపీసీ సెక్షన్ కంటే వైకాపా సెక్షన్లే అమలవుతున్నాయని గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ తెదేపా అధ్యక్షులు శ్రావణ్ కుమార్ విమర్శించారు. జైల్ భరో కార్యక్రమంలో మహిళలపై పోలీసులు దాడి చేయడాన్ని నిరసిస్తూ 29 గ్రామాల్లో రాజధాని ఐక్యకార్యాచరణ సమితి బంద్ కు పిలుపునిచ్చింది.
అనంతవరం, కృష్ణాయపాలెం, వెంకటపాలెం, అబ్బరాజుపాలెం, పెదపరిమి, నీరుకొండ గ్రామాల్లో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతవరం, రాయపూడిలో మహిళలు రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రామంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. అంబేడ్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఇదీ చదవండి: