ETV Bharat / state

TDP Leaders Fires on Police: ఏపీ పోలీసుల తీరుపై టీడీపీ నేతల ఆగ్రహం.. మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిక

TDP Leaders Fires on Police: పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ నేతలు మండిపడ్డారు. అంగళ్లు, పుంగనూరు ఘటనల్లో చంద్రబాబు, టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసులు పెట్టించినంత తేలిగ్గా వైసీపీ మూకలపై చర్యలు తీసుకోగలరా అని బొండా ఉమా నిలదీశారు. పుంగనూరు ఘటనను చూపించి టీడీపీ కార్యకర్తలను సాధించాలనుకుంటే.. భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వర్ల రామయ్య హెచ్చరించారు.

tdp leaders fires on police
tdp_leaders_fires_on_police
author img

By

Published : Aug 11, 2023, 8:18 PM IST

Updated : Aug 11, 2023, 9:19 PM IST

TDP Leaders Fires on Police: ఏపీ పోలీసుల తీరుపై టీడీపీ నేతల ఆగ్రహం.. మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిక

TDP Leaders Fires on Police: రాష్ట్రంలో పోలీసుల వ్యవహారశైలి చాలా పక్షపాతంగా ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. పుంగనూరు ఘటనను సాకుగా తీసుకుని టీడీపీ నాయకులను వేధించడమే పోలీసులు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఎఫ్ఐఆర్​లు రాసేది వీరే, కేసు రిజిస్టర్ చేసేది వీరే, ముద్దాయిలను నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్టు చేసేది వీరేనని దుయ్యబట్టారు. శిక్షలు కూడా తమరే వేస్తే ఓ పనైపోతుంది కదా అని వర్ల ఎద్దేవా చేశారు.

ముద్దాయిలు టీడీపీ వారైతే వారి పట్ల పోలీసులు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు చేస్తున్న టేబుల్ ఇన్వెస్ట్​గేషన్ మానాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం నాయకులకు బెయిల్ రాకూడదు, రిమాండుకు వెళ్లి తీరాలనే దృష్టితో పోలీసులు ప్రతిదానికి హత్యాయత్నం కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు.

AP Police Role in YSRCP Govt Angallu Incident: ఏపీలో పోలీసు రాజ్యం.. వైసీపీ రాజ్యాంగం.. ఎదురుతిరిగితే కేసులే..!

దిష్టిబొమ్మ తగలబెడితే.. హత్యాయత్నం కేసు పెడతారా..: వెంకటగిరిలో టీడీపీ నాయకులు కేవలం దిష్టిబొమ్మ తగలబెడితే హత్యాయత్నం కింద కేసు రిజిష్టర్ చేస్తారా అని నిలదీశారు. ఒంటిమీద పెట్రోల్ పడ్డట్టు ఆధారాలు లేకపోయినా.. పెట్రోల్ పోసి నిప్పంటించబోయారని తప్పుడు కేసు పెడతారా.. అసలు అక్కడ మనిషే లేరు అని వర్ల రామయ్య మండిపడ్డారు. వెంకటగిరి పోలీస్ స్టేషన్​లో రిజిస్టర్ చేసిన కేసును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

మహిళా కానిస్టేబుల్​పై వైసీపీ నాయకులు దాడి చేస్తే ఏం చేస్తున్నారు: అనంతపురం సెబ్ పోలీసు స్టేషన్​లో మహిళా కానిస్టేబుల్​ను వైసీపీ నాయకులు చున్నీ లాగి అసభ్యకరంగా ప్రవర్తిస్తే పోలీస్ అసోసియేషన్ ఏం చేస్తోందన్నారు. వైసీపీ కార్యకర్తలు చూపించిన ఇళ్లల్లో రైడ్ చేసి ఆడ, మగ తేడా లేకుండా టీడీపీ వాళ్లను భయభ్రాంతులకు గురి చేస్తే భవిష్యత్తులో పుట్టగతులుండవని హెచ్చరించారు. పుంగనూరు ఘటనను చూపించి తెలుగుదేశం కార్యకర్తలను సాధించాలనుకుంటే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

YSRCP Leaders Attack on SEB Constable : పోలీస్ స్టేషన్​పై వైసీపీ నేతల దండయాత్ర.. మహిళా కానిస్టేబుల్​పై విచక్షణారహితంగా దాడి..

Bonda Uma on AP Police: పోలీసులపై దాడి చేస్తున్న అధికార పార్టీ నేతల్ని చట్ట ప్రకారం శిక్షించే ధైర్యం డీజీపికి ఉన్నాయా అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. అంగళ్లు, పుంగనూరు ఘటనల్లో చంద్రబాబు, టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసులు పెట్టించినంత తేలిగ్గా వైసీపీ వాళ్లపై డీజీపీ చర్యలు తీసుకోగలరా అని నిలదీశారు.

మంత్రి పెద్దిరెడ్డి, అతని తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి అండతో బాధితులపై తప్పుడు కేసులు పెట్టిన పోలీసులు అనంతపురంలో ఎక్సైజ్ పోలీసులపై వైసీపీ నేతల దాడిని ఎలా సమర్థించుకుంటారని మండిపడ్డారు. మంత్రి అప్పలరాజు పోలీసులపై చేసిన దూషణలు పోలీస్ అధికారుల సంఘానికి కనిపించలేదా అని ఆగ్రహం వ్యక్తం చేసారు. మాజీ మంత్రి పేర్ని నాని మీడియా ఎదుటే తోటి సిబ్బందిని అవమానిస్తే పోలీస్ అధికారులు ఎందుకు స్పందించలేదని ధ్వజమెత్తారు.

AP Police System: వైఎస్సార్​సీపీ పాలనలో పాతాళంలోకి ఏపీ పోలీసు వ్యవస్థ..

తన దుర్మార్గాల్లో పోలీసుల్ని భాగస్వాముల్ని చేస్తూ, వాళ్లకే అలవెన్సులు నిలిపేస్తే, పోలీస్ సంక్షేమ విభాగం జగన్ రెడ్డిని ఎందుకు నిలదీయడం లేదని దుయ్యబట్టారు. కళంకిత పోలీస్ అధికారులు పద్ధతి, ప్రవర్తన మార్చుకొని చట్టప్రకారం పనిచేస్తే వారికే మంచిదని హితవు పలికారు. భీమవరంలో అర్చకుడిపై వైసీపీ నేత దాడి హిందూ ధర్మానికే అవమానకరమన్నారు.

Last Updated : Aug 11, 2023, 9:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.