ETV Bharat / state

'యువగళం పాదయాత్రతో వైసీపీకి వెన్నులో వణుకు' - టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణా

TDP Leaders on Jagan : పోలీసులే ఫిర్యాదుదారులు కావడం దేశంలో ఎక్కడా లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు ధ్వజమెత్తారు. తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చూసి వైసీపీకి వెన్నులో వణుకు మొదలు అయ్యిందని విమర్శించారు. అలాగే పలువురు టీడీపీ నేతలైన మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆనం వెంకటరమణా రెడ్డి, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివ రావు, జగన్ రెడ్డి తెనాలిసభ గురించి, సీఎం పాలనపై విమర్శలు సంధించారు.

TDP
టీడీపీ
author img

By

Published : Mar 1, 2023, 7:46 PM IST

TDP Leaders on Jagan : తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చూసి వైసీపీకి వెన్నులో వణుకు మొదలైందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్​ బాబు ధ్వజమెత్తారు. పాదయాత్ర 30 రోజులకు 12 కేసులు పెట్టడం ఏంటని నిలదీశారు. పోలీసులే ఫిర్యాదుదారులు కావడం దేశంలో ఎక్కడా లేదని ఎద్దేవా చేశారు. గన్నవరం, అనపర్తి ఇలా ప్రతి దాంట్లో పోలీసులే పిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. చట్టాన్ని ఉల్లంఘించిన ఏ అధికారిని లోకేశ్ వదిలిపెట్టరని.. అందరి లెక్కలు సరిచేస్తాడని హెచ్చరించారు. ఇక లోకేశ్​పై ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోవాలని సవాల్‌ చేశారు.

రైతుల్ని మరోసారి వంచించి పబ్బం గడుపుకోవడానికే, తెనాలిసభలో జగన్ రెడ్డి అబద్ధాలు, అరుపులు, కేకలతో చిత్రవిచిత్ర విన్యాసాలు చేశాడని తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. అరుపులు, కేకలతో తాను చేయని సాయాన్ని, సంక్షేమాన్ని చేస్తున్నట్టు రైతుల్ని నమ్మించడానికి జగన్ ప్రయత్నించాడని దుయ్యబట్టారు. జగన్ జమానాలో రైతులు సంతోషంగా ఉంటే, వైసీపీ ప్రభుత్వంలో ఆత్మహత్యలు ఎందుకు ఎక్కువయ్యాయని నిలదీశారు. అబద్ధాలు, మోసాలతో రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి నమ్మించి, వచ్చే ఎన్నికల్లో పబ్బం గడుపుకోవాలన్నదే.. జగన్ తాపత్రయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ చిన్నపిల్లాడిగా ఉన్నప్పటి నుంచే టీడీపీ పార్టీ ఉందన్న విషయం ముఖ్యమంత్రి గుర్తు పెట్టుకోవాలని. ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణా రెడ్డి కోరారు.

మాట తప్పి మడమ తిప్పడంలో జగన్మోహన్ రెడ్డి తనకు తానే సాటి అని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివ రావు ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా వారి సమస్యలను పట్టించుకోకపోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల గోడు వినేందుకు కూడా ముఖ్యమంత్రి సమయం ఇవ్వకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వం అగ్రిగోల్డ్‌ బాధితులకు మేలు చేస్తే జగన్ వారిని గాలికొదిలేయడమే కాకుండా వారి ఆస్తులనూ అన్యాక్రాంతం చేయడం దారుణమని దుయ్యబట్టారు.

జప్తు చేసిన అగ్రిగోల్డ్ ఆస్తులను విక్రయిస్తే రూ.35 వేల కోట్లు వస్తాయని ప్రతిపక్షంలో ఊదరగొట్టిన జగన్ ఇప్పుడు ఆస్తుల వేలంపై నోరు ఎందుకు మెదపడం లేదని నిలదీశారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారానికి రూ.1,182 కోట్లు కేటాయిస్తానన్న జగన్‌ ఆచరణలో విఫలమయ్యారని విమర్శించారు. చనిపోయిన బాధిత కుటుంబాలకు 10 లక్షలు పరిహారం ఇస్తానన్న హామీని మరిచారని ధ్వజమెత్తారు. అగ్రిగోల్డ్ బాధితులంతా జగన్ బాధితులుగా మారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తన రాజకీయ ప్రయోజనాలు పక్కనపెట్టి అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యలను పరిష్కరించి, ఆస్తులను పరిరక్షించాలని డిమాండ్‌ చేశారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.