ETV Bharat / state

రాష్ట్రంలో స్వేచ్ఛగా సమావేశాలు నిర్వహించుకునే పరిస్థితి లేదు: అచ్చెన్నాయుడు - TDP leaders criticized the policies of the YSRCP

TDP leaders on YCP policies: వైఎస్సార్​సీపీ అవలంభిస్తున్న విధానాలపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. వైఎస్సార్​సీపీ ప్రభుత్వ విధానాలపై అంతా కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఆయా పార్టీల అధ్యక్షులు సైతం స్వేచ్ఛగా సమావేశాలు నిర్వహించుకునే పరిస్థితులు లేవని అచ్చెన్న విమర్శించారు.

Assembly budget meetings
అసెంబ్లీ బడ్దెట్ సమావేశాలు
author img

By

Published : Mar 14, 2023, 12:42 PM IST

TDP leaders on YCP policies: వైఎస్సార్​సీపీ అవలంభిస్తున్న విధానాలపై తెలుగుదేశం పార్టీ నేతలు స్పందించారు. ప్రభుత్వ నిర్ణయాలపై అన్ని పార్టీలు కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. పవన్ కల్యాణ్ సభపై ప్రభుత్వ అనుసరిస్తున్న తీరుపై విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీకి వెళ్లే ముందు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

అచ్చెన్నాయుడు: వైఎస్సార్​సీపీ అవలంభిస్తున్న విధానాలపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. ఆంధ్రప్రదేశ్​లో ప్రజాస్వామ్యాన్ని వైఎస్సార్​సీపీ ఖూనీ చేస్తోందని ఆరోపించారు. ఈ ప్రభుత్వ విధానాలపై అంతా కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్​సీపీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించాలని అచ్చెన్న పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో పోస్ట్​ పెడితే అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆయా పార్టీల అధ్యక్షులు సైతం స్వేచ్ఛగా సమావేశాలు నిర్వహించుకునే పరిస్థితులు లేవని అచ్చెన్న విమర్శించారు. జనసేనతో పొత్తులపై స్పందించిన అచ్చెన్న.. ఎన్నికల సమయంలో స్పందిస్తామని వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో పొత్తులు సహజం అని పేర్కొన్నారు.

బుచ్చయ్య చౌదరి: పవన్ కల్యాణ్ సభపై ప్రభుత్వ అనుసరిస్తున్న తీరుపై టీడీపీ నేతలు బుచ్చయ్య చౌదరి స్పందించారు. పార్టీ పెట్టి పది సంవత్సరాలు అవుతున్న సందర్భంగా సభ నిర్వహించుకుంటున్నారని.. సభను నిర్వహించుకోకుండా ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని మండిపడ్డారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ప్రతిపక్షాలు అన్ని కలిసి పని చేస్తాయని వెల్లడించారు.

నిమ్మకాయల చినరాజప్ప: రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలపై ఇబ్బందులు పడుతున్నారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. ఈ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ, గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో చేసిన సంక్షేమంలో పావు వంతు సైతం చేయలేదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధ గెలుపు ఖాయమని చినరాజప్ప స్పష్టం చేశారు. తమకు 23మంది ఎమ్మెల్యేల బలం ఉందన్నారని వెల్లడిచారు. పార్టీ వీడిన నలుగురు ఎమ్మెల్యేలు గెలిచింది తెలుగుదేశం గుర్తుపై కాబట్టి, తమ అభ్యర్థి కి ఓటేయాల్సిన బాధ్యత వారికుందని చినరాజప్ప తెలిపారు. ఒక వేళ ఆ నలుగురు మాకు ఓటేయకుంటే వైఎస్సార్​సీపీ నుంచి అంతకంటే ఎక్కువ మందే తమకు ఓటేస్తారని వెల్లడించారు. తమ పార్టీతో సైతం వైఎస్సార్​సీపీ ఎమ్మెల్యేలు టచ్​లో ఉన్నారని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ అన్నా, ప్రతిపక్షాలన్నా ఈ ప్రభుత్వానికి భయం అని ఎద్దేవా చేశారు. అందు కోసమే పవన్ రోడెక్కకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.