వైకాపా ప్రభుత్వం చేనేత కార్మికులను నయవంచనకు గురి చేసిందని తెదేపా అధికార ప్రతినిధి గంజి చిరంజీవి మండిపడ్డారు. రాష్ట్రంలో మూడున్నర లక్షల మంది చేనేత కార్మికులంటే కేవలం 81వేల మందికి మాత్రమే నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత మగ్గం ఉన్న వారినే చేనేత కార్మికులుగా పరిగణిస్తూ మిగిలినవారందరినీ నట్టేట ముంచారని ధ్వజమెత్తారు.
గతంలో అద్దెకు మగ్గం నడిపే వారికి గుర్తింపు కార్డులుండటంతో పాటు ప్రభుత్వ పథకాల లబ్ధి అందేదని.. వైకాపా ప్రభుత్వం చేనేత నేస్తం కొంతమందికే అందచేస్తోందన్నారు. మిగిలిన పథకాల లబ్ధిని అందరికీ నిలిపివేయటంతో చేనేత కార్మికుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లైందని ఆవేదన వ్యక్తంచేశారు.
ఇవీ చదవండి..