ETV Bharat / state

సుద్దపల్లి క్వారీ వద్దే ధూళిపాళ్ల నరేంద్ర దీక్ష.. తెదేపా నేతల గృహనిర్బంధం

Dhulipalla Narendra Deeksha at Suddapalli: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లిలో అక్రమ మైనింగ్‌ ఆపాలంటూ... తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. వణికించే చలిలో రాత్రి మైనింగ్‌ ప్రాంతంలోనే నిద్రించారు. అధికారులు చర్యలు తీసుకునే వరకు ఆందోళన ఆపేది లేదని తేల్చిచెప్పారు. అక్రమ మైనింగ్ ప్రాంతాన్ని తెలుగుదేశం రాష్ట్ర బృందం నేడు సందర్శించనుంది. గుంటూరు జిల్లా సుద్దపల్లి క్వారీ వద్దకు పోలీసులు వెళ్లారు. ఆందోళనను విరమించాలని.. అక్కడినుంచి వెళ్లిపోవాలని తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు హెచ్చరించారు. మరోవైపు దీక్షకు మద్దతిచ్చేందుకు వెళ్తున్న పలువురు తెదేపా నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేస్తున్నారు.

Narendra Deeksha at Suddapalli Quarry
సుద్దపల్లి క్వారీ వద్దే నరేంద్ర దీక్ష
author img

By

Published : Feb 10, 2022, 12:15 AM IST

Updated : Feb 10, 2022, 7:52 AM IST

సుద్దపల్లి క్వారీ వద్దే ధూళిపాళ్ల నరేంద్ర దీక్ష.. నేడు సంఘీభావం తెలపనున్న తెదేపా బృందం

TDP Leader Dhulipalla on Illegal Mining: భారీ యంత్రాలతో రేయింబవళ్లు తవ్వకాలు...! వందల అడుగుల లోతు వరకు భూగర్భాన్ని తొలిచి అక్రమంగా మట్టి తరలింపు...! గతంలో తవ్వకాలు జరిపిన ప్రాంతంలోనే మరింత లోతుగా మట్టి తవ్వకాలు...! చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారగణం...! ఇదీ గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లిలో మట్టి అక్రమ తవ్వకాలు సాగుతున్న తీరు. దాదాపు వంద అడుగుల లోతు వరకు తవ్వి మట్టిని తరలించేస్తున్నారు. స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదంటూ.. తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర నేరుగా రంగంలోకి దిగారు.

బుధవారం క్వారీ ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన... అక్కడే భైఠాయించి నిరసన దీక్ష చేపట్టారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకునే వరకు విరమించేది లేదని తేల్చిచెప్పారు. రాత్రి గనులశాఖ అధికారులు వచ్చి చర్చించినా నరేంద్ర పట్టు విడవలేదు. స్వయంగా గనులశాఖ ఏడీ వచ్చి పరిశీలించి, తగిన చర్యలు చేపడతామని భరోసా ఇచ్చాకే ఆందోళన విరమిస్తానని స్పష్టం చేశారు. రాత్రంతా చలిలోనే దీక్షా శిబిరంలో నిద్రించారు.

రాత్రి నాతో చర్చించటానికి ఇద్దరు గనుల శాఖ అధికారులు వచ్చారు. ఇప్పటికే నోటీసులు ఇచ్చాం.. పెనాల్టీలు వేశామని అధికారులు చెప్పారు. స్వయంగా గనులశాఖ ఏడీ వచ్చి పరిశీలించి, తగిన చర్యలు చేపడతామని భరోసా ఇచ్చాకే ఆందోళన విరమిస్తాం. -ధూళిపాళ్ల నరేంద్ర, తెలుగుదేశం సీనియర్ నేత

గతంలో అనుమతులు తీసుకుని ఇక్కడ మైనింగ్ నిర్వహించేవారు. 2012 ఈ గుంతల్లో పడి నలుగురు చిన్నారులు మరణించడంతో ప్రభుత్వం అనుమతులు రద్దు చేసింది. ఎలాంటి తవ్వకాలు జరపరాదని ఆదేశించింది. కానీ అక్రమార్కులు నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 30 మీటర్ల లోతు వరకు తవ్వకాలు సాగిస్తున్నారు. సమీపంలోని రైల్వేట్రాక్ వరకు తవ్వుకుంటూ వెళ్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.

ప్రతిపక్షనేతగా 2017లో సీఎం జగన్ ఇక్కడి మైనింగ్‌పై ఆందోళన నిర్వహించారు. ఇప్పుడు సొంతపార్టీ నేతలే అక్రమ తవ్వకాలు సాగిస్తున్నా.. పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నరేంద్ర దీక్షకు సంఘీభావంగా తెదేపా రాష్ట్ర బృందం నేడు సుద్ధపల్లిలో పర్యటించనుంది. అయితే రంగంలోకి దిగిన పోలీసులు.. విజయవాడ భవానీపురంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, గుంటూరులోని వసంతరాయపురంలో నక్కా ఆనంద్‌బాబును గృహ నిర్బంధం చేశారు. అలాగే పలుచోట్ల తెదేపా నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారు.

TDP Leader Dhulipala on Mining : ప్రజాప్రతినిధుల అండతోనే మైనింగ్ - ధూళిపాళ్ల నరేంద్ర

Last Updated : Feb 10, 2022, 7:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.