వైకాపా ప్రభుత్వం వెంటనే లబ్ధిదారులకు టిడ్కో గృహాలను అందించాలని... గుంటూరు జిల్లా నరసారావుపేట నియోజకవర్గ తెదేపా ఇన్చార్జ్ చదలవాడ అరవింద బాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వం పేదలకు సంక్రాంతి వరకు ఇళ్లు ఇవ్వకుంటే... తెదేపా ఆధ్వర్యంలో తామే వారితో గృహప్రవేశాలు చేయిస్తామని హెచ్చరించారు.
తెదేపా హయాంలో నరసరావుపేటలో అర్హులైన 1540 మంది లబ్ధిదారులకు టిడ్కో గృహాలను నిర్మించామని... వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా వాటిని లబ్ధిదారులకు అందించ లేదని మండిపడ్డారు. అమరావతి, పోలవరానికి మద్దతుగా నిర్వహించిన చలో కోటప్పకొండ మహా పాదయాత్రకు నరసరావుపేట అఖిలపక్షం నేతలు, తెదేపా కార్యకర్తలు, మహిళలు భారీ ఎత్తున మద్దతునిచ్చారని తెలిపారు. ఈ మహాపాదయాత్రతో వైకాపా ప్రభుత్వం కళ్లు తెరుస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు.
ప్రస్తుత ప్రభుత్వం వింతధోరణితో ముందుకెళ్తోందని అరవింద బాబు దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టును రివర్స్ టెండరింగ్ ద్వారా ముందుకు వెళ్లకుండా, కేంద్రం నుంచి నిధులు రాకుండా వైకాపా అడ్డుకుంటోందని ఆరోపించారు. దేశ చరిత్రలో ఇలాంటి ముఖ్యమంత్రిని ప్రజలు ఎప్పుడూ చూడలేదన్నారు. పరిపాలన సరిగా చేయలేని నాయకులకు ట్రంప్‌కు పట్టిన పరిస్థితి పడుతుందని మర్శించారు.
ఇదీ చదవండి: