ETV Bharat / state

TDP Leader Anam on Jagan: వామ్మో.. సీఎం జగన్​ తాగే నీరు, ధరించే చెప్పులు ఇంత ఖరీదా..?

TDP Leader Anam Comments on CM Jagan: నిరుపేదనంటూ ముఖ్యమంత్రి జగన్‌ ప్రజల ముందు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని.. తెలుగుదేశం నేత ఆనం వెంకటరమణారెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీఎం జగన్‌ తాగే నీరు, ధరించే చెప్పుల ధరలు, వివిధ ప్రాంతాల్లోని ఆయన నివాసాలు అంటూ పలు పోస్టర్లను విడుదల చేశారు.

TDP Leader Anam Comments on CM Jagan
TDP Leader Anam Comments on CM Jagan
author img

By

Published : May 17, 2023, 2:27 PM IST

వామ్మో.. సీఎం జగన్​ తాగే నీరు, ధరించే చెప్పులు ఇంత ఖరీదా..?

TDP Leader Anam Comments on CM Jagan: భారతదేశంలోనే అత్యంత పేద ముఖ్యమంత్రి వైఎస్​ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉందంటూ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణా రెడ్డి వ్యంగ్యాస్త్రం సంధించారు. రూపాయి జీతం మాత్రమే తీసుకుంటూ ఉప్మాతో ఆకలి తీర్చుకుంటున్నపేద సీఎం గురించి ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలంటూ పలు ఫోటోలను మీడియా ఎదుట ప్రదర్శించారు. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు సాక్షి మీడియా తనది కాదన్నది సరేనన్న ఆనం.. భార్య ముఖంలో చిరునవ్వు చూసేందుకు సాక్షి సర్క్యులేషన్ పెంచేలా వాలంటీర్లతో ఎందుకు కొనిపిస్తున్నావని ప్రశ్నించారు.

భారతి కళ్లల్లో ఆనందం చూడాలని సాక్షిలో కోట్లాది రూపాయల ప్రకటనలు ఎందుకిచ్చారని నిలదీశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 60 రూపాయలు విలువ చేసే హిమాలయ మంచి నీళ్లు తాగితే సాక్షి మీడియా ద్వారా గగ్గోలు పెట్టారని గుర్తు చేశారు. నేడు అదే జగన్ మోహన్ రెడ్డి.. 60 శాతం డిస్కౌంట్​తోనే 5వేల 499 రూపాయల విలువ చేసి 750మిల్లీ లీటర్ మంచి నీళ్లు తాగుతున్న వైనంపై సాక్షిలో కథనం ఎందుకు రాలేదని నిలదీశారు.పేద ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి మొసలి చర్మంతో చేసి వాడే చెప్పుల ఖరీదు అక్షరాల 1లక్షా 34వేల 800 రూపాయలు అంటూ విమర్శించారు.

"ఆనాడు చంద్రబాబు మీడియా సమావేశంలో వాటర్‌ బాటిల్‌పై రాద్దాంతం చేశారు. ఇవాళ సీఎం జగన్‌ వాడుతున్న వాటర్‌ బాటిల్‌పై ఏమంటారు?. జగన్‌ వాడే వాటర్‌ బాటిల్‌ కంపెనీ 'ఆవా'.. బాటిల్‌ ధర రూ.5వేల 499. రూ.6 వేలు పెట్టి వాటర్‌ బాటిల్‌ ఎవరైనా వాడతారా?. జగన్‌ వాడే చెప్పుల ధర ఎంతో తెలుసా... లక్షా 34 వేల 800. రబ్బర్‌ చెప్పుల నుంచి లక్షా 34 వేల 800 విలువచేసే వస్తువులు ఎలా వాడుతున్నారు. 2004లో రాజశేఖర్‌ సీఎం అయినప్పుడు జగన్‌ ఆస్తి ఎంతో కోటి 74 లక్షల రూపాయలు. 2009లో ఎన్నికల అఫిడవిట్‌లో 77 కోట్ల 39 లక్షల రూపాయలు, 2011లో ఎన్నికల అఫిడవిట్‌లో రూ.445 కోట్లు, 2019లో ఎన్నికల అఫిడవిట్‌లో రూ.510 కోట్లకు ఎలా వెళ్లింది"-ఆనం వెంకటరమణారెడ్డి, తెలుగుదేశం పార్టీ నేత

తనకు ఇల్లు కూడా లేదని చెప్పుకునే పేద సీఎం జగన్మోహన్ రెడ్డి.. పులివెందుల ప్యాలెస్, హైదరాబాద్​ లోటస్ పాండ్, కడప ప్యాలెస్, విశాఖ రుషికొండపై కట్టే ప్యాలెస్, బెంగుళూరు, చెన్నై, ముంబై, కలకత్తాలో ఉన్న ప్యాలెస్​లు ఎవరివో చెప్పాలని డిమాండ్ ఆనం చేశారు. ఆ ప్యాలెస్లు తనవి కావని చెప్పి ఎవరైనా వాడుకోవచ్చని సీఎం చెప్పగలరా అని ప్రశ్నించారు. పదో తరగతి ఫెయిల్ ఆయిన జగన్మోహన్ రెడ్డికి లక్ష రూపాయలు విలువ చేసే పెన్నుతో ఏం రాస్తాడని ఎద్దేవా చేశారు. 2004 ఎన్నికల సమయంలో అఫిడవిట్​లో కోటి 74లక్షల రూపాయలుగా ఆస్తి చూపిన జగన్మోహన్ రెడ్డి.. 2009లో రూ.77.39 కోట్ల ఆస్తిని ఎలా చూపించారని ప్రశ్నించారు. ఏవీ తనవి కాదని చెప్పే జగన్మోహన్ రెడ్డి, కుటుంబం కూడా తనది కాదని చెప్పి భారతికి అన్యాయం చేయవద్దని వేడుకుంటున్నా అని ఎద్దేవా చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.