ETV Bharat / state

'కరోనా వ్యాప్తికి అధికార పార్టీ నేతలు కారణం అవుతున్నారు' - కరోనా పరీక్షలు తాజా వార్తలు

కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని గుంటూరులో మాజీమంత్రి ఆలపాటి రాజా విమర్శించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార పార్టీ నేతల తీరుపై మండిపడ్డారు. కరోనా వ్యాప్తికి అధికార పార్టీ నాయకులే కారణమంటూ ఆరోపించారు.

tdp leader alapati raja comments on governement at guntur
గుంటూరులో మాజీమంత్రి ఆలపాటి రాజా మీడియా సమావేశం
author img

By

Published : Jul 22, 2020, 12:19 PM IST

గుంటూరులో మాజీమంత్రి ఆలపాటి రాజా మీడియా సమావేశం

ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఎక్కువవుతోందని తెదేపా నేత ఆళ్లపాటి రాజా మండిపడ్డారు.. కోవిడ్ నియంత్రణకు సంబంధించి యంత్రాంగానికి దిశానిర్దేశం చేయాల్సిన ముఖ్యమంత్రి... పారాసిటామాల్ మాత్రలు, సహజీవనం అంటూ తేలిగ్గా మాట్లాడి సమస్య పెద్దదయ్యేందుకు కారణమయ్యారని ఆరోపించారు. వైకాపా నేతలు రాష్ట్రంలో కరోనా పరీక్షలు చేయించుకోవడానికి భయపడి.. హైదరాబాద్‌కు వెళ్తున్నారని ఆరోపించారు.

సీఎం జగనే మాస్కు ధరించడం లేదని, మాస్కు ధరించని సామాన్యులపై పోలీసులు లాఠీ ఛార్జీ చేయడం దారుణమని రాజా అన్నారు.. కరోనా పరీక్షలు నివేదికలు రావటంలో చాలా ఆలస్యం అవుతోందని... కొన్నిసార్లు తప్పుడు నివేదికలు వస్తున్నాయని తెలిపారు. కరోనా సమయంలో దుకాణాలు తెరిచారని... దుకాణాల వద్ద భౌతిక దూరం లేక చాలామంది వైరస్ బారిన పడ్డారని మండిపడ్డారు. కరోనా విధుల్లో ఉన్న వైద్యులు, ఆసుపత్రి సిబ్బందికి రక్షణ పరికరాలు కూడా ఇవ్వటం లేదని... ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారని వైరస్ వ్యాప్తికి అధికార పార్టీ నేతలు కారణం అవుతున్నారని విమర్శించారు. కరోనా నుంచి ప్రజలే రక్షించుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి. వంతెన నిర్మించి..మా ప్రాణాలు కాపాడండి...!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.