ETV Bharat / state

'వైకాపా నేతలు చిల్లర రాజకీయాలు మానుకోవాలి'

తెదేపా అధినేత చంద్రబాబు పొరపాటున ఓ పదాన్ని సంబోధించారే కానీ వేరే కులాన్ని కించపరచాలనే ఉద్దేశం లేదని ఆ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర కన్వీనర్ చంద్రశేఖర్ యాదవ్ అన్నారు. ఈ విషయంపై చంద్రబాబు పత్రిక ముఖంగా వివరణ ఇచ్చారన్నారు. కానీ వైకాపా నేతలు రెచ్చగొట్టి చంద్రబాబు ఇంటి వద్ద ఆందోళన చేయించారని ఆరోపించారు. వైకాపా నేతలు ఇటువంటి చర్యలు మానుకోవాలని చంద్రశేఖర్​ హితవు పలికారు.

Tdp bc cell
Tdp bc cell
author img

By

Published : Dec 7, 2020, 3:34 PM IST

Updated : Dec 7, 2020, 4:18 PM IST

వైకాపా నేతలు కక్షసాధింపు చర్యలలో భాగంగా ఓ కులాన్ని రెచ్చగొట్టి వారితో తెదేపా అధినేత చంద్రబాబు నివాసం వద్ద ఆందోళన చేయించారని ఆ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర కన్వీనర్ చంద్రశేఖర్ యాదవ్ అన్నారు. చంద్రబాబు వాడుక భాషలో పొరపాటున అన్న వాఖ్యాన్ని ఉద్దేశపూర్వకంగా వైకాపా నేతలు రాద్ధాంతం చేస్తున్నారన్నారు. మనోభావాలు దెబ్బతిన్నాయని ఆ కులానికి చెందిన కార్పొరేషన్ డైరెక్టర్​ ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకొస్తే మరుసటి రోజే వివరణ ఇచ్చారని తెలిపారు.

అయినా కొంతమంది దుష్టశక్తులతో కలసి నిరసనలు తెలపడటం బాధాకరమన్నారు. ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలని వైకాపా నేతలకు హితవుపలికారు.

ఇదీ చదవండి : విలేకర్లను అనుమతించకపోతే నేనూ వెళ్లిపోతా: వైకాపా ఎమ్మెల్యే

Last Updated : Dec 7, 2020, 4:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.