ETV Bharat / state

తెదేపా గెలుపు దేశానికే అవసరం: చంద్రబాబు

తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపునిస్తామని తెదేపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పార్టీలోని ప్రతి కార్యకర్తను ఆదుకునే బాధ్యత తనదేనని, సంక్షేమ నిధి ద్వారా వారి కుటుంబాలకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు
author img

By

Published : May 7, 2019, 6:08 AM IST

గత 37 ఏళ్లుగా తెదేపా అనేక ఎన్నికలు చూసిందని.. కానీ ఏ ఎన్నికల్లో లేని అడ్డంకులు ఈ ఎన్నికల్లో ఎదురయ్యాయని ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా ఆత్మకూరు హ్యాపీ రిసార్ట్స్‌లో నిర్వహించిన అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షలో సీఎం మాట్లాడారు. తెదేపా క్రమశిక్షణకు మారు పేరని.. సంస్థాగతంగా బలమైన పునాదులు కలిగి ఉందని చెప్పారు. పటిష్ఠమైన వ్యవస్థగా పార్టీని రూపొందించడమే తమ లక్ష్యమన్నారు. పార్టీ విజయానికి కార్యకర్తలు ప్రాణాలకు తెగించి పనిచేశారని కొనియాడారు. అనేక అడ్డంకులను అధిగమించి ఓట్లేశారని.. పట్టుదలగా ముందుకొచ్చి పోలింగ్‌లో పాల్గొన్నారంటూ అందరికీ అభినందనలు తెలిపారు.
ఓటింగ్ శాతం పెరగడం తెదేపాకే అనుకూలం...
2014 సార్వత్రిక ఎన్నికల్లో చివరి దశలో రాష్ట్రంలోఎన్నికలు నిర్వహిస్తే, ఈసారి తొలిదశలోనే ఎన్నికలు పెట్టడం తెదేపాకే సానుకూలమైందన్నారు. ఓటింగ్‌ శాతం పెరగడం తమకు కలిసివచ్చే అంశమని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి భాజపా, వైకాపా నేతలు అడుగడుగునా ఆటంకాలు సృష్టించిన.. ప్రజాభిమానం మాత్రం తెదేపా పైనే ఉందన్నారు. ఈ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ గెలుపు రాష్ట్రానికే కాదు దేశానికే అవసరమన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు

దేశంలో ఏ పార్టీకీ లేదు
ఈ ఎన్నికలో సేవామిత్ర, బూత్ కమిటి,ఏరియా కమిటీలను కొత్తగా ఏర్పాటు చేశామని వారంతా కలిసికట్టుగా గట్టిగా పనిచేశారని కితాబిచ్చారు. తెలుగుదేశం పార్టీకి 55వేల మంది బూత్ కమిటీ కన్వీనర్లు ఉన్నారు. 4లక్షల మంది సేవామిత్రలు ఉన్నారు. రాష్ట్రంలో 60లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. ఇంత గొప్ప సంస్థాగత బలం దేశంలో మరే పార్టీకి లేదు. తెలుగుదేశం పార్టీ ఒక సమర్ధ కుటుంబంగా పేరు తెచ్చుకోవాలని చంద్రబాబు హితవు పలికారు.

ప్రతి కార్యకర్తను ఆదుకునే బాధ్యత నాదే....
పార్టీలోని ప్రతి కార్యకర్తను ఆదుకునే బాధ్యత తనదేనని, సంక్షేమ నిధి ద్వారా వారి కుటుంబాలకు అండగా ఉంటామన ఆయన భరోసా ఇచ్చారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తెదేపా విజయానికి కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓటింగ్ సరళి పై కాల్ సెంటర్ నుంచి , సర్వేల ద్వారా, పార్టీ ఆఫీసు నుంచి మూడు వేర్వేరు నివేదికలు తెప్పించుకుంటునన్నారు. 23న అసలు ఫలితం తెలిశాక, ఎవరి అంచనా వాస్తవానికి దగ్గరగా ఉందో బేరీజు వేస్తామని చంద్రబాబు తెలిపారు.

దిల్లీకి పయనం...8న బంగాల్ లో ప్రచారం
అమలాపురంలో నేతలతో సమీక్ష ముగిసిన అనంతరం చంద్రబాబు దిల్లీ వెళ్లారు. 50శాతం వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగునుంది. చంద్రబాబు సహా 21 మంది ప్రతిపక్షనేతలు పిటిషన్ దాఖలు చేశారు. విచారణ వినేందుకు చంద్రబాబు సహా పలువురు నేతలు కోర్టుకు హాజరయ్యే అవకాశం ఉంది. ఎన్నికలపై ప్రజలకు విశ్వాసం పెంచేందుకు ఇదే సరైందని ప్రతిపక్షనేతలు అంటున్నారు. ఈ నెల 8,9 తేదీల్లో బంగాల్ లో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

ఇవి చదవండి...'40 ఏళ్లలో చేయలేని అభివృద్ధి.. ఐదేళ్లలో చేశాం'

Intro:ap_knl_141_06_cpm_madu_av_c14 కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం లో సిపిఎం పార్టీ నాయకుడు మధు పర్యటించారు

Body:కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం హలో ని శకునాల గుట్టపాడు గ్రామాల్లో సిపిఎం పార్టీ నాయకుడు మధు పర్యటించారు శకునాల గ్రామంలో లో ఉపాధి పనులను పరిశీలించి కూలీలతో సమావేశం నిర్వహించారు కూలీలకు అందాల్సిన వసతులు ఇతర విషయాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం గుట్టపాడు గ్రామంలోని రైతులతో ముఖాముఖి ఏర్పాటు చేశారు రైతుల అనుమతులు లేకుండా పొలాలు ఎలా తీసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రైతులు అందరు కలిసి ఉంటే కోల్పోయిన పొలాలకు నష్టపరిహారం అందుతుందని ప్రభుత్వంపై పోరాటం చేయాలని సూచించారు

Conclusion:నవీన్ కుమార్ పాణ్యం ఈ టీవీ రిపోర్టర్ కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.