గుంటూరు జిల్లా పెడకూరపాడు మండలం 75 తాళ్లూరులో భాష్యం బ్రహ్మయ్య హోటల్ నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి పదిన్నర సమయంలో హోటల్ వ్యర్థాలు, చెత్తను పడేసేందుకు బ్రహ్మయ్య వెళ్లారు. అప్పుడే ఆయన ముఖంపై.. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు విష పదార్థంతో కూడిన స్ప్రేను పిచికారి చేశారు. దీంతో బాధితుడిని ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి: మందడంలో ఉద్రిక్త వాతావరణం