మంచి పని ప్రారంభించిన తక్షణమే మార్పు రాదని... నిరంతరం కొనసాగిస్తేనే మార్పు సాధ్యమవుతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అన్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో ప్లాస్టిక్ నిషేధం కోసం పర్యావరణహిత సంచులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జస్టిస్ లావు నాగేశ్వరరావుతో పాటు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్, జిల్లాల న్యాయమూర్తులు జస్టిస్ హరిహరనాథ శర్మ, జస్టిస్ జ్యోతిర్మయి పాల్గొన్నారు. గ్రామస్థులు, విద్యార్థులకు సంచులు పంపిణీ చేశారు. ప్లాస్టిక్ సంచులు వినియోగించి... పర్యావరణానికి హాని చేయవద్దని సూచించారు.
ఇవీ చదవండి