ETV Bharat / state

హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేతకు సుప్రీంకోర్టు నిరాకరణ - ఏపీ రాజధాని అమరావతి వార్తలు

అమరావతి భూముల వ్యవహారంలో సీఐడీ విచారణపై హైకోర్టు విధించిన స్టే ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తుళ్లూరులో భూముల రికార్డుల తారుమారయ్యాయన్న ఆరోపణలపై సీఐడీ జరిపిన విచారణపై హైకోర్టు స్టే విధించగా... దాన్ని సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ వేసింది. స్టే ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయస్థానం... ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది.

సుప్రీం కోర్టు
సుప్రీం కోర్టు
author img

By

Published : Sep 12, 2020, 5:52 AM IST

అమరావతిలో రాజధాని భూముల వ్యవహారం కేసులో హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తామని... తదుపరి విచారణలో తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.

అమరావతిలో భూ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించగా.... దీనిపై హైకోర్టు గతంలో స్టే విధించింది. దీన్ని ఎత్తివేయాలని కోరుతూ సర్కార్ సుప్రీంను ఆశ్రయించగా.... ఆ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదించారు. అమరావతిలో పేదలు, ఎస్సీ, ఎస్టీలకు చెందిన భూములను బ్రహ్మానందరెడ్డికి బదలాయించడంలో తుళ్లూరు మాజీ తహశీల్దార్‌ సుధీర్‌బాబు సహకరించారని ఆరోపించారు. అవి అసైన్డ్ భూములు కావటంతో సమీకరణలో ప్రభుత్వం ఉచితంగానే తీసుకుంటుందని...పేదలు, ఎస్సీలకు మాయమాటలు చెప్పి బదలాయించారని పేర్కొన్నారు. రాజధాని భూముల వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగిందని.... అనేక పరిశీలనల తర్వాత ప్రభుత్వం పలువురు అధికారులపై కేసులు నమోదు చేసిందని సుప్రీం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై సీఐడీ విచారణ ప్రారంభమవగానే సుధీర్‌బాబు, బ్రహ్మానందరెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ వేశారని.... అప్పుడు స్టే విధించిందన్నారు. విచారణ ప్రాథమిక దశలోనే స్టే ఇవ్వడం సమంజసం కాదని రోహత్గీ వాదించారు.

స్టే ఇవ్వడంపై అసంతృప్తి

విచారణ కొనసాగితే ఇబ్బందులేంటని ప్రతివాదుల తరఫు న్యాయవాదిని ప్రశ్నించిన సుప్రీం... హైకోర్టు స్టే ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వ పిటిషన్‌ను విచారణకు అనుమతిస్తున్నట్టు పేర్కొంది. ఇది ఒక్క బ్రహ్మానందరెడ్డికి సంబంధించినదిగానే ఎందుకు భావిస్తారని... దర్యాప్తు చేస్తే కుంభకోణం ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది కదా అని సుప్రీం అభిప్రాయపడింది. కేసు విచారణ త్వరగా పూర్తయ్యేలా హైకోర్టుకు సూచిస్తామంది. ప్రతివాదుల తరఫున వాదించిన సిద్ధార్థ లూథ్రా.... ప్రభుత్వం నమోదు చేసిన ఎఫ్​ఐఆర్​లోని పలు అంశాలను తప్పుగా అనువదించారని అన్నారు. తెలుగులోని అసలు ప్రతిని సమర్పించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అందుకు అనుమతించిన ధర్మాసనం... ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ ఈ నెల 21లోగా కౌంటర్ దాఖలుకు ఆదేశించింది. స్టే ఎత్తివేతపై తదుపరి విచారణలోనే నిర్ణయం తీసుకుంటామని స్పష్టంచేసింది. ఈలోగా సంబంధిత పత్రాలన్నీ సమర్పించాలని వాయిదాలు కోరవద్దని ఇరుపక్షాలకు సూచించింది. ఈ నెల 22న తదుపరి విచారణ జరగనుంది.

ఇదీ చదవండి

దళితులపై జరిగిన దాడులన్నింటిపైనా సీబీఐ విచారణ జరపాలి: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.