ETV Bharat / state

పార్లమెంటు చేసిన చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం మార్చగలదా..! ఏపీకి సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం - అమరావతి పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ

SC HEARING ON AMARAVATI PETITIONS: రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు ఉత్తర్వులపై పూర్తిస్థాయి స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నెలరోజుల్లో కొన్ని పనులు.. 6 నెలల్లో మరికొన్ని పనులు చేయాలన్న హైకోర్టు పరిమితులపై స్టే విధించింది. విచారణను వచ్చే ఏడాది జనవరి 31కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు.. జనవరి 31లోపు జవాబు తప్పనిసరిగా దాఖలు చేయాలని ఆదేశించింది.

SC ON AMARAVATI
SC ON AMARAVATI
author img

By

Published : Nov 28, 2022, 7:49 PM IST

SC ON AMARAVATI PETITIONS : రాజధాని అమరావతి అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్రప్రభుత్వంతో పాటు హైకోర్టు తీర్పులో మరికొన్ని అంశాలు చేర్చాలని రాజధాని రైతు పరిరక్షణ సమితి.. వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో సుధీర్ఘ విచారణ జరిగింది. వాదనల సందర్భంగా మూడు రాజధానుల బిల్లును రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుందన్న ప్రభుత్వ న్యాయవాదులు... హైకోర్టు అమరావతిలోనే కొనసాగుతోందని.. ప్రస్తుతం అక్కడే ఉందని తెలిపారు.

హైకోర్టు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు?: రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఏర్పడిన హైకోర్టును మార్చాలని ఎలా ప్రకటిస్తారని ధర్మాసనం.. పదే పదే ప్రశ్నించింది. ప్రస్తుతం ఉంది తాత్కాలిక భవనమే అని, శాశ్వత భవనం నిర్మించాల్సి ఉందని.. ప్రభుత్వ తరఫు లాయర్లు బదులిచ్చారు. ఇప్పటివరకు హైకోర్టుకు ఎన్ని నిధులు కేటాయించారు? ఎంత ఖర్చు చేశారని ధర్మాసనం పలు మార్లు ప్రశ్నించగా..150 కోట్లు కేటాయించి.. 116 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పారు.

ఇప్పుడున్న హైకోర్టు భవనంలో కనీస వసతులు కూడా లేవన్న సుప్రీం ధర్మాసనం.. న్యాయమూర్తులు, న్యాయవాదులు సాయంత్రం వరకు ఎలా ఉంటారని ప్రశ్నించింది. క్యాంటిన్‌ సహా.. అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని.. రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది సమాధానం ఇచ్చారు.

అమరావతిలో హైకోర్టు ఏర్పాటు కోసం చాలా ఖర్చుచేశారన్న ధర్మాసనం..ఇప్పుడు కర్నూలులో పెట్టాలని ఎందుకు ప్రతిపాదిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులను ప్రశ్నించింది. దీనికి.. అదంతా ముగిసిపోయింది.. కర్నూలులో పెట్టాలన్న ప్రతిపాదన ఇప్పుడేమీ లేదని..ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ చెప్పారు.

అమరావతిలోనే హైకోర్టు ఉండాలని హైకోర్టు చెప్పిందని వేణుగోపాల్ పేర్కొనగా..హైకోర్టు ఎక్కడ ఉండాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుందని ధర్మాసనం ప్రశ్నించింది. అమరావతిలోనే ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన బదులిచ్చారు. ఇదే సందర్భంలో.. ప్రభుత్వ తరపు మరో న్యాయవాది నిరంజన్‌రెడ్డి స్పందిస్తూ... ప్రస్తుతానికి అమరావతిలోనే ఉంది.. రేపు రాష్ట్రప్రభుత్వం ఎక్కడ పెట్టాలనుకుంటుందో చెప్పలేమని అన్నారు.

అసెంబ్లీలో ఏ బిల్లు తీసుకువస్తారో చెప్పడం కష్టమని ధర్మాసనానికి తెలిపారు. రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలనుకుంటున్నారని సుప్రీం న్యాయమూర్తులు ప్రశ్నించగా.. ఒకచోట ఉండాలనే నిబంధన ఏదీ రాజ్యాంగంలో లేదని, అది రాష్ట్ర ప్రభుత్వ విచక్షాధికారంతో ముడిపడి ఉంటుందని.. వేణుగోపాల్‌ సమాధానం ఇచ్చారు.

ఇలాంటి విషయాలపై.. హైకోర్టు నిరంతర పర్యవేక్షణ కుదరదని వివరించారు. గత ప్రభుత్వం.. కేంద్రం ఇచ్చిన నిధులు కాకుండా.. కేవలం 3 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనానికి చెప్పారు. దీనికి న్యాయమూర్తులు స్పందిస్తూ.. 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు హైకోర్టు గుర్తించి కదా..దానికి ఏం చెపుతారని ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని వికేంద్రీకరణ చేసే అధికారం లేదని.. రైతుల తరపు సీనియర్‌ న్యాయవాది ఫాలీ నారీమన్‌ వాదించారు. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టంలో 'ది క్యాపిటల్‌' అని మాత్రమే ఉందని, అలాంటప్పుడు మూడు రాజధానులని ఎలా చెపుతారని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం.. పదేళ్ల పాటు హైదరాబాద్‌ అటు తెలంగాణకు, ఇటు ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా ఉంటుందని.. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ఒక రాజధాని- 'ఏ క్యాపిటల్‌' అని మాత్రమే చట్టంలో పేర్కొన్నారని వివరించారు.

అదే సందర్భంలో.. ఏపీ రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలో అధ్యయనం చేసేందుకు ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారని..ఆ కమిటీ నివేదిక ప్రకారమే అమరావతిని ఎంచుకున్నట్లు చెప్పారు. రాష్ట్ర హైకోర్టు సహా.. నివాస సముదాయాలు, ఇతర భవనాల పురోగతిపై రైతుల తరపు మరో న్యాయవాది శ్యాం దివాన్‌ పలు ఫోటోలతో కూడిన నివేదికను సుప్రీంకోర్టుకు అందించారు.

2019 జూన్‌ నుంచి అమరావతిలో పనులు మొత్తం నిలిచిపోయాయని, దాన్ని దృష్టిలో పెట్టుకునే హైకోర్టు కాలపరిమితి విధించిందన్నారు. రైతులతో చేసుకున్న ఒప్పందానికి విరుద్ధంగా.. అన్ని నిబంధనలు పక్కన పెట్టి ఇష్టారాజ్యాంగా వ్యవహరించారని ధర్మాసనానికి వివరించారు. ఆరు నెలల్లో రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేయడం సాధ్యమేనా అని ధర్మాసనం ప్రశ్నించగా.. అది సాధ్యం కాదు.. కానీ.. ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తీసుకెళ్లి.. తమ ప్రతిపాదనను చెప్పాల్సి ఉందని, కానీ, ఆ పని చేయలేదన్నారు. అందుకే రైతులు.. కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేశారని చెప్పారు.

రాష్ట్ర భవిష్యత్తును, తమ భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చినట్లు శ్యాం దివాన్‌ వివరించారు. ఏపీ సీఆర్​డీఏను రద్దుచేసి వికేంద్రీకరణ పేరుతో 3 రాజధానుల చట్టాన్ని తెస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తన అఫిడవిట్‌లో చెప్పిందన్నారు. వికేంద్రీకరణ చట్టాన్ని చేసే అధికారం శాసనసభకు లేదని హైకోర్టు చెప్పింది తప్ప.. అసలు శాసనాలు చేసే అధికారం లేదని చెప్పలేదని.. శ్యాం దివాన్‌ ధర్మాసనానికి వివరించారు. అలా ఐతే సరే అని ఈ సందర్భంగా జస్టిస్‌ నాగరత్న వ్యాఖ్యానించారు.

పార్లమెంటు చట్టాన్ని ఏపీ ప్రభుత్వం ఎలా మార్చగలదు?: పార్లమెంటు చేసిన చట్టాన్ని ఏపీ ప్రభుత్వం ఎలా మార్చగలదన్న ధర్మాసనం.. విభజన చట్టంలో ది క్యాపిటల్‌ అని మాత్రమే ఉంది కదా.. దీనిపై ఏం చెబుతారని ప్రశ్నించింది. పార్లమెంటులో చేసిన చట్టంలో సవరణ చేసే అధికారం.. రాష్ట్ర ప్రభుత్వానికి లేనప్పుడు అందులో ఉన్న అంశాలను సవరించే అధికారం ఎలా ఉంటుందని నిలదీసింది.

భూ సమీకరణలో రైతులకు చట్టబద్ధంగా ఇచ్చిన హామీని ఎలా ఉల్లంఘిస్తారన్న ధర్మాసనం.. ప్రభుత్వ హామీని నమ్మి భూములు ఇచ్చిన రైతులకు ఏ విధంగా న్యాయం చేస్తారని అడిగింది. ఏపీ సీఆర్​డీఏ చట్టాన్ని అమలు చేయకపోతే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసినట్లు కాదా అన్న సుప్రీంకోర్టు.. ఇప్పటికే 50వేల కోట్ల రూపాయల మేరకు పెట్టిన పెట్టుబడుల సంగతేంటని ప్రశ్నించింది.

హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా?: అదే సందర్భంలో.. రాష్ట్ర హైకోర్టు కాలపరిమితితో కూడిన నిబంధనలు విధించడంపై కూడా ధర్మాసనం ప్రశ్నలు సంధించింది. ఆరు నెలల్లో రాజధానిలో పనులు పూర్తి చేయాలనడంపై స్పందించిన సుప్రీంకోర్టు.. హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా అని ప్రశ్నించింది. హైకోర్టు ఒక ప్రభుత్వంలా వ్యవహరిస్తే ఎలా అన్న ధర్మాసనం.. అలా వ్యవహరిస్తే.. అక్కడ ప్రభుత్వం ఎందుకని వ్యాఖ్యానించింది.

కేంద్రానికి విజ్ఞప్తి చేయవచ్చు: అనంతరం రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది వేణుగోపాల్‌ మరోసారి కల్పించుకుంటూ.. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరారు. అలా ఇస్తే.. పిటిషన్‌ పరిష్కారం అయినట్లేనని న్యాయమూర్తి జస్టిస్‌ జోసెఫ్‌ వ్యాఖ్యానించారు. పార్లమెంటులో చేసిన చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేయడం సాధ్యం కానప్పుడు.. కేంద్రానికి విజ్ఞప్తి చేయవచ్చు కదా అని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించిన ధర్మాసనం.. కేవలం కాలపరిమితి ఉన్న నిబంధనలపై మాత్రమే స్టే ఇచ్చింది.

హైకోర్టు ఇచ్చిన మాండమస్‌లో పేర్కొన్న తొలి రెండు నిబంధనలు.. ల్యాండ్‌ పూలింగ్‌ రూల్స్‌-2015 షెడ్యూల్‌ 2, 3లో పేర్కొన్న అంశాలను అమలు చేయాలని, సేకరించిన భూమిలో అమరావతి నిర్మాణానికి మినహా.. మరే అవసరాలకు కేటాయింపులు చేయకూడదన్న నిబంధనలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అదేవిధంగా.. మాస్లర్‌ ప్లాన్‌లో ఎలాంటి మార్పులు చేయవద్దని.. రాజధానిని వికేంద్రీకరించడం లేదా.. మార్చడంపై రాష్ట్ర ప్రభుత్వం తదుపరి ఎలాంటి చట్టాలు చేసే అధికారం లేదని తీర్పులో హైకోర్టు స్పష్టం చేసిన.. పది అంశాలపై కూడా స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది.

అన్ని అంశాలపై తుది విచారణ అనంతరమే తగిన ఆదేశాలు ఇవ్వనున్నట్లు స్పష్టం చేస్తూ ప్రతివాదులు అందరికీ నోటీసుల జారీ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరి 31న చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఆలోపు ప్రతివాదులు అంతా.. తమ తమ అభిప్రాయాలను చెప్పాలని విచారణ వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.