ETV Bharat / state

Summer Effect: రాష్ట్రంలో అధికంగా ఎండలు.. ఆ జిల్లాలోనే అధిక ఉష్ణోగ్రత

Summer Temperatures : రాష్ట్రమంతటా ఎండలు మండిపోతున్నాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో ఎండ తీవ్రతను తట్టుకోలేక ప్రజలు ఇంట్లోనే ఉంటున్నారు. ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. రాగల రెండు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

Summer Effect
Summer Effect
author img

By

Published : Apr 27, 2023, 4:30 PM IST

Updated : Apr 27, 2023, 4:38 PM IST

Todays Temperatures : రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఈ రోజు 2-3 డిగ్రీల మేర పెరిగాయి. వేసవి కాలం ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వాతావరణం పొడిగా ఉందని.. రాగల రెండు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతల్లో భాగంగా అత్యధికంగా ఏలూరు జిల్లాలో 41.5 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా కృష్ణా జిల్లాలో 37.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఈరోజు ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి : ఈ రోజు ఏపీలో రోజు వారి ఉష్ణోగ్రతల కంటే 2-3 డిగ్రీల మేర పెరిగాయి. ఏలూరు జిల్లాలో 41.5 డిగ్రీల సెల్సియస్, నెల్లూరు జిల్లాలో 41 డిగ్రీలు, పశ్చిమగోదావరి జిల్లాలో 41 డిగ్రీలు, అనకాపల్లి జిల్లాలో 40.83 డిగ్రీల సెల్సియస్, విజయనగరం జిల్లాలో 40.7 డిగ్రీలు, కైకలూరు 40.7 డిగ్రీలు, శ్రీకాకుళం జిల్లాలో, 40.58 డిగ్రీల సెల్సియస్, ప్రకాశం జిల్లాలో 40.31 డిగ్రీలు, సిద్ధవటం 40.22 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లాలో 40 డిగ్రీల సెల్సియస్, నంద్యాల జిల్లాలో 39.8 డిగ్రీల సెల్సియస్, సత్యసాయి జిల్లాలో 39.8 డిగ్రీలు, వైస్సార్ కడప జిల్లాలో 39.75 డిగ్రీల సెల్సియస్, పల్నాడు లో 39 డిగ్రీలు, తిరుపతి జిల్లాలో 39 డిగ్రీలు, అనంతపురం జిల్లాలో 39.6 డిగ్రీలసెల్సియస్, కర్నూలు లో 39.4 డిగ్రీలు, గుంటూరు లో 38.9 డిగ్రీల సెల్సియస్, బాపట్ల జిల్లాలో 38.9 డిగ్రీలు, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 38.8 డిగ్రీలు, అన్నమయ్య జిల్లాలో 38.7 డిగ్రీల సెల్సియస్, పార్వతీపురం మన్యం లో 38.6 డిగ్రీలు, తుని 38.6 డిగ్రీలు, కృష్ణా జిల్లాలో 37.7 డిగ్రీల సెల్సియస్​గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

వేసవి కాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు కావటం చూసి ప్రజలు అందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ఎండా కాలం పూర్తయ్యే వరకు వైద్యులు, నిపుణులు సలహాలు పాటిస్తే సులువుగా ఈ వేసవి కాలం నుంచి బయటపడొచ్చు. ఎండా కాలం ఎండ నుంచి మనల్ని మనం రక్షించుకోడానికి నిపుణులు పలు సూచనలు ఇస్తున్నారు ఇంతకీ అవేెంటో చూద్దామా..

పగటి వేళ ఎండలో అస్సలు తిరగకూడదు. తప్పనిసరి అయితే తప్ప పగటి పూట బయటకు వెళ్లండి.. వీలైెనంత వరకు ఇంట్లోనే ఉండండి. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, పళ్ల రసాలు తరచూ తీసుకోవాలి, వేడి గాలుల ప్రభావంతో వడదెబ్బ తగిలే అవకాశాలు అధికం కాబట్టి ఎండలో వెళ్లినప్పుడు గొడుగు వెంట తీసుకు వెళ్లడం మంచిది. అలాగే తెల్లటి వస్త్రాలు, టోపీ ధరించి వెళ్లాలి. ఎండాకాలంలో ప్రత్యేకంగా చిన్నపిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి :

Last Updated : Apr 27, 2023, 4:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.