కొవిడ్ రెండవ దశ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సైతం ఆరోగ్యశ్రీ వర్తింపచేసే విధంగా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఆ క్రమంలో కొన్ని ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ లేదని తాత్కాలికంగా ఆరోగ్యశ్రీ వర్తింప చేసే విధంగా ఆ ఆసుపత్రుల నుంచి పత్రాలు స్వీకరిస్తున్నట్లు గుంటూరు జిల్లా సబ్ కలెక్టర్ పేర్కొన్నారు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్ బాధితులకు చికిత్స అందిస్తూ.. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమకు ఫిర్యాదు వచ్చిందన్నారు. ఈ మేరకు ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులతో ఆయన సమీక్షించారు. ఈ సమీక్షలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. బాధ్యతల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ వసూలు చేస్తే.. ఆ ఆసుపత్రిపై చర్యలు తీసుకునే విధంగా కమిటీని వేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్దేశిక నిబంధనలు ఉల్లంఘిస్తే ఆసుపత్రులకు లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.
'ఇళ్లకు ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా రద్దు'
తెనాలిలోని అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సమృద్ధిగా ఉందని సబ్ కలెక్టర్ పేర్కొన్నారు. అత్యవసరమైన వారికి 104 ద్వారా వైద్యంతో పాటు ఆక్సిజన్ కూడా ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. అంతేకానీ స్వతహాగా ఇళ్లకు ఆక్సిజన్ సిలిండర్ తీసుకువెళ్లే అవకాశం లేదని పేర్కొన్నారు. ఇళ్లకు ఆక్సిజన్ సరఫరా ద్వారా బ్లాక్ మార్కెటింగ్ పెరిగిపోతుందని వివరించారు. దానిని అధిగమించేందుకే ఇళ్లకు సరఫరా రద్దు చేసినట్టు తెలిపారు. అత్యవసరమైతే ఆసుపత్రుల్లో వైద్యుల ద్వారా అనుమతి పత్రాన్ని తీసుకుని.. వీఆర్వోల పర్యవేక్షణలో సిలిండర్ను తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: