Boating start from Sagar to Nagarjuna hill: పర్యాటక కేంద్రమైన నాగార్జున కొండకు బోటు సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. గుంటూరు జిల్లా విజయపురి సౌత్ నుంచి నాగార్జున కొండకు లాంచీ సర్వీసులను రాష్ట్ర పర్యాటక శాఖ ప్రారంభించింది. ఈ మేరకు కొండకు వెళ్లే టూరిజం లాంచీలకు ఐఆర్ఎస్, అటవీశాఖ నుంచి అనుమతులు మంజూరు అయ్యాయని అధికారులు పేర్కొన్నారు.
start boating from Sagar to Nagarjuna hill: భద్రతా కారణాలతో గత 2 ఏళ్లుగా సాగర్‌లో పర్యాటక శాఖ బోట్లు నిలిపేశారు. ప్రస్తుతం పురావస్తు శాఖ ఉద్యోగులకే కొండకు వెళ్లేందుకు అనుమతి లభించగా...వారికి మాత్రమే బోడును నడిపారు. వారం రోజుల అనంతరం పర్యాటకులకు బోటింగ్ అందుబాటులోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు.
ఇదీచదవండి..
Papikondalu Boat Tourism: పర్యాటకులకు గుడ్న్యూస్.. పాపికొండలు యాత్ర పునఃప్రారంభం