కరోనా పై పోరులో ముఖ్యమంత్రి సహాయనిధికి అమరావతి ఎస్ఆర్ఎమ్ విశ్వవిద్యాలయం రూ.25 లక్షలను అందించింది. వర్శిటీ వైస్ ఛానల్సర్ ఆచార్య నారాయణ.. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌కు ఈ చెక్కును అందించారు. అనంతరం ఎస్ఆర్ఎమ్ విశ్వవిద్యాలయ ప్రతినిధులు కరోనా కట్టడి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రిని అడిగి తెలుసుకున్నారు.
ఇవీ చదవండి...'కాంట్రాక్టర్లకు రూ.6400 కోట్లు.. ఉద్యోగులకు వేతనాల్లో కోతలు'