మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని సభాపతి దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు సభాపతికి స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలలో పాల్గొనాలని అధికారులు సభాపతిని ఆహ్వానించారు. మార్చిలో ఓటాన్ బడ్జెట్ నిర్వహణపై పూర్తి సమాచారం లేదన్నారు. సభలో సమయం వృథాపై సభాపతి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికే సభ్యులు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అన్నివేళలా యాక్షన్‌కి రియాక్షన్ సమధానం కాదన్నారు. ప్రివిలేజ్ కమిటీ సభ్యులు నివేదిక ఇవ్వగానే వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చదవండి: స్థల వివాదం.. రెండు కుటుంబాల మధ్య ఘర్షణ