డ్రోన్ వ్యవహారంపై గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీ రామకృష్ణ స్పందించారు. జలవనరుల శాఖ వరద పరిస్థితిని డ్రోన్ ద్వారా సమీక్షించేందుకు ఓ ప్రైవేట్ కంపెనీకి అప్పగించిందని చెప్పారు. ఆ సంస్థ సిబ్బంది డ్రోన్ ద్వారా ఫొటోలు తీస్తున్న సమయంలో చంద్రబాబు ఇంటి వద్ద ఉన్న సెక్యూరిటి సిబ్బంది వివరాలు సేకరిస్తున్నారని... అంతలోనే కొంతమంది తెదేపా నేతలు వచ్చి అడ్డగించారని చెప్పారు. పూర్తి వ్యవహారంపై విచారణకు ఆదేశించామన్నారు.
ఇవీ చదవండి.