గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం ఇనిమెట్లలో సభాపతి కోడెల శివప్రసాదరావుపై దాడికి సంబంధించి... నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని గుంటూరు గ్రామీణ ఎస్పీ రాజశేఖర్ బాబు చెప్పారు. ఘటనపై విచారణ కొనసాగుతుందని వెల్లడించారు. వీడియోలు, దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించామని... వారందరిపైనా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
ఇనిమెట్లతోపాటు పల్నాడులో మిగతా ప్రాంతంలోనూ పోలింగ్ తర్వాత ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. పల్నాడులో 30 వరకు పోలీస్ పికెటింగ్‌లు కొనసాగుతాయని.....ప్రజలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి