రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లులు తీసుకొస్తే.. కొన్ని పార్టీలు తమ స్వలాభం కోసం ప్రజలను మభ్యపెడుతూ దుష్ప్రచారం చేస్తున్నాయని భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. గుంటూరు జిల్లా పెదవడ్లపూడిలో నిర్వహించిన రైతు సాధికారత సదస్సులో ఎంపీ జీవీఎల్ నరసింహారావు, మాజీమంత్రి రావెల కిశోర్ బాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు. కేంద్రం తీసుకువవ్చిన వ్యవసాయ బిల్లులతో రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు.
కనీస మద్దతు ధర కొనసాగుతోందని.. వ్యవసాయ మార్కెట్లు మూతపడతాయనేది అపోహ మాత్రమేనని వీర్రాజు స్పష్టం చేశారు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఒప్పంద వ్యవసాయ విధానం అమలు జరుగుతోందని గుర్తు చేశారు. వ్యవసాయ చట్టాల నుంచి వెనక్కితగ్గే ప్రసక్తే లేదని.. వాటి అమలుపై తగిన సూచనలు తీసుకుంటామని ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: