సంగం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్ అరెస్టుకు నిరసనగా.. సొసైటీ అధ్యక్షులు, పాడి రైతులు గుంటూరులో ఆందోళన చేపడుతున్నారు. జిల్లాలోని పొన్నూరు మండలం చింతలపూడి, నండూరు, పచ్చలతాడిపర్రు, గోళ్లమూడిపాడు తదితర గ్రామాల్లో పాల కేంద్రాల వద్ద పాడి రైతులు నిరసన దీక్షను చేపడుతున్నారు. అక్రమంగా అరెస్టు చేసిన నరేంద్ర కుమార్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: ధూళిపాళ్ల నరేంద్ర పిటిషన్ కొట్టేసిన హైకోర్టు