ETV Bharat / state

CBI Custody: జడ్జిలపై అనుచిత వ్యాఖ్యల కేసు..రెండు రోజుల సీబీఐ కస్టడీకి నిందితుడు - జడ్జిలపై అనుచిత వ్యాఖ్యల కేసు న్యూస్

సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులను దూషిస్తూ పోస్టులు పెట్టిన కడపకు చెందిన లింగారెడ్డి రాజశేఖర్​రెడ్డిని రెండు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది. విచారణ సమయంలో థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని నిందితుడు కోరితే తన న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని ఈ మేరకు నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి అరుణశ్రీ ఆదేశాలిచ్చారు.

social media activist in CBI custody
జడ్జిలపై అనుచిత వ్యాఖ్యల కేసు
author img

By

Published : Jul 13, 2021, 9:56 PM IST

సామజిక మాధ్యమాన్ని వేదికగా చేసుకొని న్యాయమూర్తులపై దూషణలకు పాల్పడిన లింగారెడ్డి రాజశేఖరరెడ్డిని రెండు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ గుంటూరు నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి అరుణశ్రీ ఆదేశాలిచ్చారు. న్యాయమూర్తులపై దూషణలకు పాల్పడిన వారిపై రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు తొలుత స్థానిక పోలీసులు, అనంతరం సీఐడీ, హైకోర్టు ఉత్తర్వుల మేరకు సీబీఐ కేసు దర్యాప్తు చేపట్టిన విషయం విదితమే.

ఈ కేసులో 15వ నిందితుడిగా ఉన్న కడపకు చెందిన రాజశేఖరరెడ్డిని సీబీఐ పోలీసులు అరెస్టు చేసి ఈనెల 12న గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. ఆయన వద్ద మరికొంత సమాచారం సేకరించాలని దర్యాప్తు చేసేందుకు కస్టడీకి అప్పగించాలని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో రెండు రోజులపాటు నిందితుడిని సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం ఉదయం నుంచి నిందితుడుని కస్టడీలోకి తీసుకుని..,గురువారం ఉదయం వైద్య పరీక్షల అనంతరం న్యాయస్థానంలో హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశించారు. విచారణ సమయంలో థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని నిందితుడు కోరితే తన న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని న్యాయస్థానం సీబీఐకి సూచించింది.

ఏ-15గా నిందితుడు

రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు తమ ఇంటర్వ్యూలు, ప్రసంగాలు, సామాజిక మాధ్యమాల్లో పోస్టుల ద్వారా.. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు దురుద్దేశాలను ఆపాదిస్తూ, అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారన్న అభియోగాలపై అప్పటి హైకోర్టు ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌ జనరల్‌ రాజశేఖర్‌ ఫిర్యాదులు చేశారు. దీనిపై సీఐడీ (సైబర్‌ క్రైమ్‌) విభాగం 16 మంది వ్యక్తులు, గుర్తుతెలియని మరికొందరిపై 12 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. 2020 అక్టోబర్‌ 12న దర్యాప్తును హైకోర్టు సీబీఐకి అప్పగించింది. అన్ని ఎఫ్‌ఐఆర్‌లనూ కలిపి.. ఒకే కేసు నమోదు చేసింది. దానిలో లింగారెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఏ-15గా ఉన్నారు.

ఇదీ చదవండి

సామాజిక మాధ్యమాల్లో జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు.. అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.