ETV Bharat / state

అమ్మాయి ట్విస్ట్‌: నన్నెవరూ కిడ్నాప్‌ చేయలేదు..పెళ్లి చేసుకుందామని వెళ్లా..! - Sirisilla shalini kidnap case updates

Twist in Kidnap: తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లాలో యువతి కిడ్నాప్ ఊహించని మలుపు చోటుచేసుకుంది. తనను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదంటూ కిడ్నాప్ కు గురైన యువతి.. ఓ వీడియోను విడుదల చేసింది. జానీ అనే యువకుడిని నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నట్లు చెప్పిన యువతి.. జానీని పెళ్లి చేసుకుంటున్న వీడియోను విడుదల చేసింది. దీంతో కిడ్నాప్ కేసులో నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది.

పెళ్లి చేసుకుందామని వెళ్లా..!
పెళ్లి చేసుకుందామని వెళ్లా..!
author img

By

Published : Dec 20, 2022, 4:29 PM IST

Twist in Kidnap: తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో యువతి కిడ్నాప్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. తనను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదంటూ బాధిత యువతి వీడియో విడుదల చేసింది. జానీ అనే యువకుడిని నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నట్లు చెప్పిన యువతి.. జానీని ఇష్టపూర్వకంగా ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు పెళ్లి చేసుకున్న వీడియోలను జానీ, షాలినిలు విడుదల చేశారు.

ఈ సందర్భంగా తన కోరికపైనే జానీ తనను తీసుకెళ్లాడని షాలిని పేర్కొంది. తమ తల్లిదండ్రులు వేరే సంబంధాలు చూస్తున్నారని.. వచ్చి తీసుకెళ్లమని జానీకి తానే ఫోన్‌ చేసి చెప్పానని తెలిపింది. తీసుకెళ్లే ముందు మాస్క్‌ ఉండటం వల్ల గుర్తుపట్టలేదన్న ఆమె.. గుర్తుపట్టిన తర్వాత ఇష్టపూర్వకంగా వెళ్లి పెళ్లి చేసుకున్నానని స్పష్టం చేసింది.

పెళ్లి చేసుకుందామని వెళ్లా..!

నన్ను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదు. ఇష్టపూర్వకంగా జానీని ప్రేమ వివాహం చేసుకున్నా. నాలుగేళ్లుగా జానీ, నేను ప్రేమించుకుంటున్నాం. మా తల్లిదండ్రులు వేరే సంబంధాలు చూస్తున్నారు. వచ్చి తీసుకెళ్లమని జానీకి నేనే ఫోన్‌ చేసి చెప్పా. తీసుకెళ్లేముందు మాస్క్‌ ఉండటం వల్ల గుర్తుపట్టలేదు. గుర్తుపట్టిన తర్వాత ఇష్టపూర్వకంగా వెళ్లి పెళ్లి చేసుకున్నా. - యువతి షాలిని

ఇవీ చూడండి..

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.