కృష్ణాయపాలెంలో అమరావతి పరిరక్షణ సమితి , రాజకీయేతర ఐకాస నేతలు మౌనదీక్ష చేపట్టారు. రైతులపై అక్రమంగా బనాయించిన కేసులను కొట్టివేయాలని వారు డిమాండ్ చేశారు. గుంటూరు లాడ్జి సెంటర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద బైఠాయించి మౌన దీక్షను నిర్వహించారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరారు. రైతులు అలుపెరుగని పోరాటం చేస్తుంటే.. ఉద్యమాన్ని అణిచివేయడానికి వైకాపా నేతలు అక్రమ కేసులు పెట్టిస్తున్నారని అమరావతి పరిరక్షణ సమితి రాజకీయేతర ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు శివారెడ్డి అన్నారు.
గ్రామంలోకి వచ్చి రైతలు వివరాలు సేకరిస్తున్నామని చెప్పి వారిపైన అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయంగా రైతులు పైన ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. ఇప్పటికైనా పోలీసులు పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. వాటికి భయపడే ప్రసక్తే లేదని.. అమరావతిని రాజధానిగా కొనసాగించే వరకు ఉద్యమం ఆగదని రాష్ట్ర కన్వీనర్ మల్లికార్జున రావు స్పష్టంచేశారు.
ఇదీ చూడండి. ఏవోబీలో మందుపాతర పేల్చిన మావోయిస్టులు