ETV Bharat / state

వల నీడన సహజ వ్యవసాయం.. తెచ్చి పెట్టింది లాభం.. - ముండ్లమూరు గ్రామం తాజావార్తలు

మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ పద్ధతులను మార్చేస్తున్నారు యువ రైతులు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి.. సేంద్రియ పద్ధతులను అనుసరిస్తున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన రైతులు ఆధునిక సాంకేతికతను జోడించి, షేడ్​నెట్లు ఏర్పాటు చేసి.. వ్యవసాయం చేస్తున్నారు. వివిధ రకాల పంటలు సాగుచేస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

shadenet farming
షేడ్​నెట్ వ్యవసాయం
author img

By

Published : Jan 15, 2021, 2:11 PM IST

ఆధునిక సాంకేతికతో షేడ్​నెట్లు ఏర్పాటు చేసి.. వ్యవసాయం చేస్తూ ఔరా అనిపించుకుంటున్నారు. సేంద్రియ పద్ధతిలో పంటలు సాగుచేస్తూ.. ప్రకాశం జిల్లాకు చెందిన యువ రైతులు అందరి ప్రశంసలు పొందుతున్నారు.

ఇలా మొదలైంది:

గుంటూరు జిల్లా సత్తెనపల్లెకు చెందిన నల్లబోతు వేణుగోపాల్, గిద్దలూరుకు చెందిన అంబటి శేఖర్ రెడ్డి విత్తన సంస్థలో ఉద్యోగంలో భాగంగా పరిచయం అయ్యారు. వారికి రైతులతో ఉన్న పరిచయాల ద్వారా నూతన సాగు విధానాలను తెలుసుకుని వ్యవసాయంలోకి దిగారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని ముండ్లమూరు గ్రామంలో పది ఎకరాల పొలాన్ని లీజుకు తీసుకున్నారు. అందులో తొలుత ప్రభుత్వ రాయితీతో రెండు షేడ్ నెట్లు ఏర్పాటు చేసుకుని నర్సరీ ద్వారా నారు పెంచి రైతులకు విక్రయించడం ప్రారంభించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల వారే కాకుండా కర్ణాటక, తెలంగాణ నుంచి కూడా వచ్చి నారు తీసుకెళుతున్నారు.

"పలు రకాల కూరగాయల పంటలు పండిస్తున్నాం. ఇక్కడే పండించి.. ఇక్కడే అమ్ముతున్నాం. మా క్షేత్రాన్ని చూడటానికి వచ్చినవారే వినియోగదారులుగా మారుతున్నారు. వాళ్లకు తెలిసిన వారు కూడా వస్తుంటారు. ఫోన్లు చేసి ఆర్డర్​ చెప్పినా కూడా.. కొరియర్​ ద్వారా లేదంటే ఆ ప్రాంతానికి వెళ్లే వారికి ఇచ్చి పంపిస్తాం. మాతో పాటు 20-30 మందికి ఉపాధి కల్పిస్తున్నాం" -అంబటి శేఖర్ రెడ్డి

సాధారణ సాగులో పంటలకు చీడపట్టడం, పురుగు తినేయడం, తెగులు సోకడం లాంటి సమస్యలతో దిగుబడిపై ప్రభావం చూపుతుంది. అలానే రసాయనాల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. క్షేత్రస్థాయిలో రైతుల ఇబ్బందులను ఈ యువ రైతులు గుర్తించారు. సొంతంగా మరో రెండు షేడ్​నెట్లను ఏర్పాటు చేసుకుని అందులో సేంద్రియ ఎరువుల వాడకంతో ప్రకృతిసాగుకు శ్రీకారం చుట్టారు. అలా చెర్రీటమాటా, క్యాప్సికమ్, బజ్జీమిరప, క్యాబేజీ, బ్రకోలి, కాలీఫ్లవర్, చిక్కుడు, బీర, కీర, పుచ్చ, కొత్తిమీర, బంతి తదితర పంటలను సాగు చేస్తున్నారు. నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్నారు. ఈ క్షేత్రాన్ని సందర్శించే యువ రైతులు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.

షేడ్​నెట్ వ్యవసాయం ద్వారా కూరగాయల పంటలు

"పదెకరాల విస్తీర్ణంలో ప్రాజెక్టును మొదలుపెట్టాం. ఆరెకరాల్లో షేడ్​నెట్లు వేసి వ్యవసాయం చేస్తున్నాం. రాష్ట్రంలోనే కాక తెలంగాణ, కర్ణాటకకు కూడా పలు రకాల కూరగాయలు, నార్లు అందిస్తున్నాం. ఇది వరకు బొప్పాయి నారుని పక్క రాష్ట్రాల నుంచి తెప్పించుకునేవారు. ఇప్పుడు మేమే బొప్పాయి మొక్కలు పెంచి రైతులకు అందిస్తున్నాం. పచ్చి, ఎండు మిరపకు సంబంధించి దాదాపు 30 రకాలు పెంచుతున్నాం. ఈ ప్రాంతంలో అందుబాటులో లేని క్యాప్సికమ్​, బ్రకోలి, రెడ్​ క్యాబేజీ, చెర్రీ టొమోటో, యూరోపియన్​ దోసకాయ లాంటివి పండించి.. ఫామ్​ దగ్గరే అమ్ముతున్నాం" -వేణుగోపాల్

ఇదీ చదవండి: గాలి పటాలకు విద్యుత్​ పాశం.. తస్మాత్​ జాగ్రత్త!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.