గుంటూరు హిందూ కళాశాల కూడలిలో రవాణా శాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వాహన తనిఖీలు నిర్వహించారు. కాలం తీరిన, కాలుష్యం వెదజల్లుతున్న వాహనాలను గుర్తించి పట్టుకున్నారు. పాత వాహనాలతో కార్బన్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి ఉద్గారాలు వెలువడుతున్నాయని డీటీసీ మీరా ప్రసాద్ తెలిపారు.
కొత్తగా వచ్చే వాహనాలన్నీ బీఎస్-6 సామర్ధ్యం ఉన్నవేనని.. వాటికే అనుమతిస్తున్నామని చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టేందుకు జిల్లా యంత్రాంగం ప్రయత్నిస్తోందని చెప్పారు.
ఇదీ చదవండి: అనుమతి తీసుకోకపోవడం వల్లే గృహనిర్బంధం: హోం మంత్రి సుచరిత