గుంటూరు జిల్లా ఉప్పలపాడు వద్ద ఇసుకను అక్రమంగా తరలిస్తున్న టిప్పర్ వాహనాన్ని ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చోదకుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా ఉమా మహేశ్వరపురం నుంచి గుంటూరులోని వినుకొండకు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఉప్పలపాడు వద్ద వాహనాన్ని ఆపి ఇసుక స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు వెంకట సత్యనారాయణ రెడ్డి అదుపులోకి తీసుకుని, కేసునమోదు చేశారు. అనంతరం అతన్ని ఐనవోలు పోలీసులకు అప్పగించినట్లు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. పట్టుబడిన ఇసుక సుమారు 28 టన్నులు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'చదువంటే నాకిష్టం'తో పాఠశాల్లో గ్రంథాలయాల అభివృద్ధి: మంత్రి సురేశ్