గుంటూరు కృషి భవన్‌లో విత్తన డిస్ట్రిబ్యూటర్లతో వ్యవసాయశాఖ అధికారులు సమావేశమయ్యారు. గుంటూరు జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు విజయభారతి హాజరయ్యారు. అనుమతి లేని గైసెల్ లాంటి కలుపు మందులు అమ్మితే లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. వచ్చే ఖరీఫ్‌లో నకిలీ పత్తి విత్తనాలు విక్రయించినట్టు తెలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులకు, నర్సరీలకు నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయాలని సూచించారు. మే నెలాఖరు వరకు విత్తన విక్రయాలు ప్రారంభించొద్దన్నారు.
ఇది కూడా చదవండి.