పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను గుడ్డిగా ఆమోదించవద్దని అధికారులకు ఆదేశించినట్లు... ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. స్థానిక పరిస్థితులను అంచనా వేసే ముందుకెళ్లాలని చెప్పినట్లు తెలిపారు. రాజ్యాంగం కల్పించిన విచక్షణాధికారాలను ఉపయోగించి..గడువును సైతం పెంచుకునే అవకాశం ఉందని వెల్లడించారు.
గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై ఎస్ఈసీ సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులు తెలుసుకున్నారు. కొవిడ్ కేసులు గణనీయంగా తగ్గాయని.. ఎన్నికల నిర్వహణకు ఇదే సరైన సమయమన్నారు. ఎన్నికలు ఆపొద్దని హైకోర్టు తీర్పు ఇచ్చిందని..కోర్టు చెప్పినా ఎన్నికలు ఆపడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ఎన్నికలు వ్యతిరేకించే శక్తులు ఇప్పటికైనా అర్ధం చేసుకోని తమ వంతు సహకారం అందించాలని సూచించారు.
ఇదీచదవండి