ETV Bharat / state

home minister reservation: హోంమంత్రి రిజర్వేషన్​పై ఎస్సీ కమిషన్ విచారణ

author img

By

Published : Aug 28, 2021, 2:32 AM IST

జాతీయ ఎస్సీ కమిషన్.. హోంమంత్రి మేకతోటి సుచరిత రిజర్వేషన్​పై విచారణ చేపట్టింది. ఈ విషయమై ఎస్సీ కమిషన్ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆమెపై ఫిర్యాదు చేసింది. వారంలోగా పూర్తి నివేదిక పంపాలని గుంటూరు కలెక్టర్​కు నోటీసులు జారీ చేసింది.

sc commission investigate on sucharita reservation

రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత రిజర్వేజన్ అంశంపై జాతీయ ఎస్సీ కమిషన్ విచారణ చేపట్టింది. తాను క్రిష్టియన్ అని సుచరిత స్వయంగా చెప్పారని.. ఎస్సీ కమిషన్ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆమెపై ఫిర్యాదు చేసింది. ఈ విషయమై 2021 జూన్​లోనే వివరాలు కోరినా ఇప్పటి వరకు అందలేదని.. ఈ నోటీసు అందిన వారంలోగా పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని గుంటూరు కలెక్టర్​కు నోటీసు పంపినట్లు లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ట్వీట్ చేసింది. నోటీసులు తన ట్విటర్ ఖాతాకు జతచేసింది. హోంమంత్రి సుచరిత గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఇదీ చదవండి: CAN BEER : క్యాన్ బీర్ విక్రయానికి ప్రభుత్వం అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.