ETV Bharat / state

నిధులు, విధులు లాగేసుకుని.. డమ్మీలను చేశారు..: సర్పంచ్​ల ఆవేదన

Problems of Sarpanchs: ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే ఇంటి పెద్దకు చెప్పుకుంటాం..! అలాగే ఊళ్లో ఏదైనా సమస్య ఉంటే గ్రామ పెద్దకు చెప్పుకుంటాం.! కానీ ఆ గ్రామ పెద్దకే సమస్య వస్తే? సమస్య సృష్టించిందే ప్రభుత్వమైతే.? ఎవరికి చెప్పుకోవాలి? ఒకప్పుడు గ్రామపెద్దగా ఓ వెలుగువెలిగిన సర్పంచ్‌ల.. నిధులు, విధులు లాగేసుకుని వైఎస్సార్సీపీ సర్కార్‌ వాళ్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చేసింది. నేటితో రెండేళ్లు పదవీకాలం పూర్తైనా.. చెప్పుకోడానికి ఒక్క పనీ చేయలేకపోయామని సర్పంచ్‌లు కుమిలిపోతున్నారు .

Agony of Sarpanchs
సర్పంచ్​ల ఆవేదన
author img

By

Published : Feb 21, 2023, 12:04 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో సర్పంచ్‌ల కష్టాలు

Problems of Sarpanchs in Andhra Pradesh: ఊరికేదో ఉపకారం చేద్దామని చివరకు ఏమీ చేయలేక రోడ్డుపక్కన పండ్లు అమ్ముకుంటున్నారు గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు సర్పంచ్‌ ఆరమళ్ల విజయ్‌కుమార్‌. ఈయనొక్కరేకాదు.. రెండేళ్ల క్రితం.. ఎన్నో ఆశలు, లక్ష్యాలతో ఎన్నికైన గ్రామ పెద్దలందరిదీ.. ఇదే పరిస్థితి. ప్రభుత్వం దెబ్బకు పంచాయతీలు నిర్వీర్యం అయ్యాయి.

ముందెన్నడూ లేని విధంగా పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులనూ.. ప్రభుత్వం లాగేసుకుంది. 14, 15 ఆర్థిక సంఘం నిధుల్లో దాదాపు రూ.1,245 కోట్లను మళ్లించింది. దీనికి.. పంచాయతీ పాలకవర్గం తీర్మానం కూడా లేదు, పీడీ ఖాతాల్లో నుంచి.. ఏకపక్షంగా కరెంటు ఛార్జీల కింద సర్దుబాటు చేసింది. ఖాతాలు ఖాళీ అవడంతో.. ఊళ్లో కనీసం కరెంటు లైటు కూడా పెట్టించలేని స్థితిలోకి సర్పంచ్‌లు వెళ్లిపోయారు.

ఆర్థిక సంఘం నిధులు ప్రభుత్వం లాగేసుకోవడంతో.. సాధారణ నిధులతో పనులు చేద్దామన్నా.. దానికీ సహకారం లేని పరిస్థితి. ఆర్థికశాఖ ఆధ్వర్యంలోని సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్‌ఎంఎస్‌) నుంచి.. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు సరిగా జీతాలూ.. చెల్లించడం లేదు. సర్పంచిలే చెత్త సేకరించి నిరసన తెలుపుతున్నా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎలాంటి స్పందన ఉండడంలేదు.

పథకం ప్రకారం సర్పంచుల అధికారాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కత్తెరవేసింది. గ్రామ సచివాలయాల ఏర్పాటుతో పంచాయతీలు ఉనికినే ప్రమాదంలో పడేసింది. సచివాలయాలు పని చేస్తోంది పంచాయతీల పరిధిలోనైనా.. అందులోని ఉద్యోగులపై సర్పంచ్‌లకు.. ఎలాంటి అధికారం లేదు. ప్రభుత్వ పథకాల నుంచి పనుల వరకూ వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులదే పెత్తనం. ఉద్యోగులకు సాధారణ సెలవు మంజూరు చూసే అధికారాన్నీ తీసేసింది.

గ్రామ సచివాలయాల్ని.. నేరుగా పర్యవేక్షించేలా కొత్తగా గ్రామ, వార్డు సచివాలయాల శాఖను ప్రభుత్వం సృష్టించింది. అది మొదలు.. ఊళ్లో పనులేవీ సర్పంచ్‌లకు తెలియకుండానే.. జరిగిపోతున్నాయి. ప్రతిపక్ష పార్టీల మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లనైతే.. పురుగుల్లా చూస్తున్నారు. వ్యవసాయ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక, పంట కాలువల మరమ్మతుల పనులు.. తాగునీటి పథకాలు ఇవేమీ సర్పంచ్‌కి తెలియకుండా.. ఎమ్మెల్యేల కనుసన్నల్లో కానిచ్చేస్తున్నారు. పేరుకు..సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక కమిటీకి సర్పంచే ఛైర్మన్‌. కానీ.. వాలంటీర్లే కర్త, కర్మ,క్రియ. అసలు ..తమను లెక్కచేసేవాళ్లే లేరంటున్నారు సర్పంచ్‌లు.

గ్రామ సచివాలయాల ఏర్పాటుకు ముందు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని పలువురు సర్పంచ్‌లు చెబుతున్నారు. గ్రామ స్థాయిలో.. పని చేసే ఉద్యోగులు పంచాయతీ కార్యాలయాలకు వచ్చి.. వివిధ అంశాలపై చర్చించి సర్పంచ్‌ల అభిప్రాయాలకు ప్రాధాన్యమిచ్చేవారని గుర్తుచేసుకుంటున్నారు.

"సర్పంచ్​లుగా ఉన్నాం కానీ సరైన గుర్తింపు లేదు. రోడ్ల విషయంలో కానీ.. వాటర్ విషయంలో ఏమైనా చేయాలంటే మాకు నిధులు ఉండాలి. నిధులు లేక ఏం చేయాలో మాకు తోచడం లేదు. ప్రజలు అడిగే మాటలకు మేము తల ఎత్తుకోలేని పరిస్థితి ఉంది. - చిన్నంరాజు, సర్పంచ్, ఉప్పలగుప్తం-కోనసీమ జిల్లా

"సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ పూర్తిగా సర్పంచ్​లను డమ్మీ చేసిన పరిస్థితులు ఉన్నాయి. సచివాలయాలలోని ఖర్చులు మాతో పెట్టిస్తున్నారు. కానీ దాని మీద వచ్చే ఆదాయం మాత్రం ప్రభుత్వం తీసుకుంటుంది". - సీహెచ్ పాపారావు, సర్పంచ్‌ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.