ఊయలే ఆ చిన్నారి ఉసురు తీసింది. ఊయల కోసం కట్టిన చీర బిగుసుకోవడంతో గుంటూరు జిల్లా ఈపూరులో 12 ఏళ్ల బాలిక శ్రీలత మృతి చెందింది. భర్తతో వేరుపడి విడిగా ఉంటూ పుట్టినింటికి వచ్చిన మహిళా కూలీ పనికి వెళ్తు చిన్నారిని చదివించుకుంటోంది. ఇంటి ఆవరణలో చీరతో ఏర్పాటు చేసిన ఊయలపై చిన్నారి శ్రీలత ఊగుతోంది.
శ్వాస తీసుకోలేక..
ఈ క్రమంలో ఉయ్యాల పురి చుట్టుకోవడంతో శ్వాస తీసుకోలేక చిన్నారి స్పృహ కోల్పోయింది. గమనించిన బాధితురాలి మేనమామ ఆమెను ఊయల నుంచి తప్పించి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీలత మృతి చెందింది. ఈ విషాద ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది.
ఇవీ చూడండి : శరన్నవరాత్రులు.. నర్సీపట్నం నుంచి ప్రత్యేక బస్సులు