ETV Bharat / state

మార్కెట్​లోకి 'సంగం' స్వీట్లు, చిరుధాన్యాలు

author img

By

Published : May 24, 2020, 4:18 PM IST

గుంటూరు జిల్లా వడ్లమూడి గ్రామంలోని సంగం డైరీ నుంచి కొత్త ఉత్పత్తులను మార్కెట్​లోకి విడుదల చేశారు. కొర్రలు, రాగులు, బొమ్మలు చిరుధాన్యాలతో పాటు బెల్లం, నెయ్యి కలిపి తయారుచేసిన లడ్డూల వంటి స్వీట్లు ఇందులో ఉన్నాయి.

sangam sweets, millets in market
మార్కెట్ లోకి సంగం స్వీట్లు, చిరుధాన్యాలు

గుంటూరు జిల్లా వడ్లమూడి గ్రామంలోని సంగం డైరీలో కొత్త ఉత్పత్తులను విడుదల చేశారు. కొర్రలు, రాగులు, బొమ్మలు చిరుధాన్యాలతో పాటు బెల్లం, నెయ్యి కలిపి తయారుచేసిన లడ్డూలు తదితర స్వీట్లను మార్కెట్లోకి విడుదల చేశారు. విదేశాల నుంచి అత్యాధునిక ప్రమాణాలతో కూడిన ప్యాకింగ్ మెటీరియల్ దిగుమతి చేసుకున్నామని సంగం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ చెప్పారు.

మొట్టమొదటిసారిగా మోడిఫైడ్ అట్మాస్పియర్ ప్యాకింగ్ అనే సరికొత్త విధానాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. ఈ ప్యాక్ వల్ల ఆక్సిజన్ శాతం తగ్గి పదార్థాల రంగు, రుచి, వాసన, స్వచ్ఛత ,నాణ్యత ప్రమాణాలు ఎక్కువ కాలం ఉంటాయని తెలిపారు. కలాకండ్, మిల్క్ కేక్, మలై లడ్డూ, కాజూ బర్ఫీ, బాదాం బర్ఫీ, కొర్ర, రాగి, జొన్న లడ్డూలు, మిశ్రమ చిరుధాన్యాల లడ్డూలు అందుబాటులోకి తెచ్చామన్నారు.

ఇదీ చదవండి:

'విశాఖ పర్యటనకు చంద్రబాబు దరఖాస్తు చేస్తే అనుమతి ఇస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.