సంగం డెయిరీని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటూ ఇచ్చిన జీవోను హైకోర్టు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయస్థానం తీర్పుపై.. సంగం డైరీ తాత్కాలిక చైర్మన్ వెంకట కృష్ణ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. అంతిమంగా ధర్మం విజయం సాధించిందన్నారు.
కోర్టు తీర్పు.. పాల ఉత్పత్తిదారులందరి విజయమని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచనలను పక్కన పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారం ఉందని చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే.. భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించక తప్పదని వెంకట కృష్ణ ప్రసాద్ హెచ్చరించారు.
ఇదీ చదవండి:
హైకోర్టు తీర్పు : సంగం డెయిరీని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటూ ఇచ్చిన జీవో నిలుపుదల