ETV Bharat / state

అమూల్ డెయిరీ కంటే ఎక్కువ ధర ఇస్తున్నాం: సంగం డెయిరీ

మంత్రి కన్నబాబు అసెంబ్లీలో చేసిన ప్రకటనను... సంగం డెయిరీ యాజమాన్యం ఖండించింది. అమూల్ డెయిరీ ఇస్తున్న ధరల కంటే సంగం డెయిరీ అధిక ధరలు చెల్లించినట్లు వివరించింది. పాల ఉత్పత్తిదారులకు రేటు విషయంలో, సాంకేతిక సహకారం విషయంలో ఎప్పుడూ రాజీ పడబోమని సంగం డెయిరీ స్పష్టం చేసింది.

'Sangam dairy prices higher than Amul dairy prices'
'అమూల్ డెయిరీ ధరల కంటే సంగం డెయిరీ ధరలే ఎక్కువ'
author img

By

Published : Dec 1, 2020, 8:38 PM IST

'Sangam dairy prices higher than Amul dairy prices'
సంగం డెయిరీ ప్రకటన

పాలకు సంగం డెయిరీ తక్కువ ధర చెల్లిస్తోందని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు అసెంబ్లీలో చేసిన ప్రకటనను... సంగం డెయిరీ యాజమాన్యం ఖండించింది. కొన్నేళ్లుగా సంగం డెయిరీ పాడి రైతులకు అత్యధిక ధర చెల్లిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. కేవలం ధర వరకే కాకుండా లాభాల్లో బోనస్ ఇస్తున్నట్లు పేర్కొంది. 2019-20 సంవత్సరంలో అమూల్ డెయిరీ ఇస్తున్న ధరల కంటే సంగం డెయిరీ అధిక ధరలు చెల్లించినట్లు వివరించింది.

అముల్ డెయిరీ గేదె పాలు లీటరుకు రూ.45.48, ఆవుపాలు లీటరుకు 28 రూపాయలు చెల్లిస్తోంటే... సంగం డెయిరీ గేదెపాలకు 46.83 రూపాయలు, ఆవుపాలకు 30.19 రూపాయలు ఇస్తున్నట్లు తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలోనే 9.06 కోట్ల లీటర్లకు ఈ ధరలు చెల్లించినట్లు స్పష్టం చేసింది. పాల ఉత్పత్తిదారులందరికీ నాణ్యమైన దాణా సరఫరా, పశువైద్య సేవలు, పశువులకు బీమా, రాయితీపై పశుగ్రాస విత్తనాలు, సైలేజీ అందిస్తున్నట్లు వివరించింది.

అమూల్ డెయిరీ సంగం కంటే లీటరుకు 5రూపాయలు ఎక్కువగా చెల్లిస్తున్నట్లు చెప్పటం సరికాదని యాజమాన్యం పేర్కొంది. సంవత్సరాది లాభాల్లోనూ రైతుల వాటాగా లీటరుకు 2 నుంచి 5 రూపాయల వరకూ బోనస్​గా ఇస్తున్నట్లు వివరించింది. పాల ఉత్పత్తిదారులకు రేటు విషయంలో, సాంకేతిక సహకారం విషయంలో ఎప్పుడూ రాజీ పడబోమని సంగం డెయిరీ స్పష్టం చేసింది.

ఇదీ చదవండీ... సీఎం జగన్​పై 3 పిటిషన్లు: రెండింటిని కొట్టేసిన సుప్రీం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.