Statewide Samagra Siksha Employees Strike 12th Day: సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల చేపట్టిన సమ్మె 12వ రోజుకు చేరుకుంది. విజయవాడ ధర్నా చౌక్ వద్ద సమగ్ర ఉద్యోగులు ధర్నా చేపట్టారు. కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ విభాగంలో పని చేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు డిమాండ్ చేశారు. సమ్మె చేస్తున్న తమ జీతాల్లో కోత విధిస్తామని అధికారులు బెదిరించడం అన్యాయమని సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కోరికలు తీర్చే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు.
Ongole: ఒంగోలు కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు మాట్లాడుతూ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు 12 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమను చర్చలకు పిలిచి తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు ఈ సమ్మె కొనసాగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంట్రాక్ట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.
Nandyala: నంద్యాలలో మోకాళ్ళ మీద నిలబడి సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి నిరంకుశ ధోరణిని విడనాడి ఉద్యోగస్తులకు న్యాయం చేయాలని విజ్ణప్తి చేశారు. లేకపోతే సీఎం జగన్మోహన్ రెడ్డికి పతనం తప్పదని హెచ్చరించారు.
KGBV Teachers Protest: తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలి.. కేజీబీవీ మహిళా అధ్యాపకుల ఆందోళన
Nellore District: నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమ్మె కొనసాగుతోంది. గత 12 రోజులుగా తాము సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ఎస్ఎస్ఏ, జెఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చర్చలకు పిలిచి కనీసం ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చకపోవడం దారుణమన్నారు. జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచి తమకు ఒక్క రూపాయి కూడా జీతం పెంచలేదని, ఇప్పుడు కూడా పెంచేది లేదని చెప్పడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమను రెగ్యులర్ చేయాలని, మినిమం టైమ్స్ స్కేల్ అయినా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంఘీభావం తెలిపిన జేడీ లక్ష్మీనారాయణ
Dr. BR Ambedkar Konaseema District: డా బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో సమగ్ర శిక్షా కాంట్రాక్టు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంతవరకు సమ్మె విరమించేది లేదని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్లకార్డులుగా వేలాడదీసి నిరసన తెలియజేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న వీరికి నగర పంచాయతీ కార్మికులు, అంగన్వాడీలు సంఘీభావం తెలిపారు. తనకున్న మూడు నెలల కాలంలో మన సమస్యలు పరిష్కరించకపోతే ఏం చేయాలో మాకందరికీ తెలుసునని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు.