ETV Bharat / state

RTC Merger Issues for Employees: సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం.. ఆర్టీసీ ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్న జగన్ సర్కార్ - ఏపీఎస్​ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు

RTC Merger Issues for Employees: ప్రభుత్వంలో విలీనమైతే ఇకపై ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అన్ని సదుపాయాలు అందుతాయనుకున్న ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయ్యింది. ప్రభుత్వ ఉద్యోగులుగా మారినప్పటికీ పొందిన ప్రయోజనమేమి లేదని.. గతంలో ఉన్న ప్రోత్సాహకాలూ కోల్పోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడున్నరేళ్లు దాటినా పింఛనుపై ఇప్పటికీ స్పష్టత లేదని వాపోతున్నారు.

RTC Merger Issues for Employees
RTC Merger Issues for Employees
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 3, 2023, 7:15 AM IST

Updated : Oct 3, 2023, 9:20 AM IST

RTC Merger Issues for Employees: సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం.. ఆర్టీసీ ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్న జగన్ సర్కార్

RTC Merger Issues for Employees: ఆర్టీసీని (APSRTC) ప్రభుత్వంలో వీలీనం చేయగానే ఉద్యోగులంతా సంబరపడ్డారు. ఇకపై తామూ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అన్ని ప్రయోజనాలు అందుకోవచ్చని ఆశపడ్డారు. కానీ మూడున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం వారికి చుక్కలు చూపిస్తోంది. విలీన అంశాలను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గతంలో ఉద్యోగ , కార్మిక సంఘాల ఆందోళనలతో ఆర్టీసీ యాజమాన్యం కాస్త కనికరించేది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో తామేమీ చేయలేమని ప్రభుత్వం వద్ద సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయంటూ యాజమాన్యం చేతులెత్తేస్తోంది.

ప్రతి అంశంపై ఏదో విధంగా ప్రభుత్వం కొర్రీలు వేసి ఉద్యోగులకు చుక్కలు చూపిస్తోంది. వచ్చే జనవరి నుంచి ఉద్యోగుల పదవీ విరమణలు మొదలు కానుండగా ఇప్పటికీ విలీన అంశాలు పరిష్కారం కాకపోవడంతో వారిలో ఆందోళన కలిగిస్తోంది. విధులకు హాజరయ్యే డ్రైవర్లు, కండక్టర్లకు డేఅవుట్‌, నైట్‌ అవుట్‌ వంటి భత్యాలు ఉంటాయి. గత సంవత్సరం ఆగస్టు వరకు వారి జీతాలు ఆర్టీసీ విధానం ప్రకారం ప్రభుత్వం ఇచ్చేది. గత సెప్టెంబర్‌ నుంచి ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేశారు. అప్పటి నుంచి భత్యాల్లో సందిగ్ధత నెలకొంది. ఓవర్‌ టైం డ్యూటీ చేసిన వారికి ప్రతినెలా భత్యం ఇవ్వకుండా రెండు, మూడు నెలలకోసారి ఇస్తున్నారు.

APSRTC Recruitment: ఏపీఎస్ఆర్టీసీలో సిబ్బంది కొరత.. ఖాళీల భర్తీ ఎప్పుడు..?

నిత్యం మూడు వేల నైట్‌ సర్వీసుల్లో విధులకు హాజరయ్యే డ్రైవర్‌, కండక్టర్లకు నైట్‌ అవుట్‌ అలవెన్స్ ఇవ్వడం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనల్లో నైట్‌ అవుట్‌ లేదని అధికారులు చెబుతున్నారు. ఆర్టీసీలో ఈ భత్యం కింద రోజు 90 రూపాయలు ఉండగా.. ప్రభుత్వంలో అయితే రూ.400 నుంచి 600 వరకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ వీరికి ఏదీ అందడం లేదు. గతంలో ఆర్టీసీ ఉద్యోగులపై యాజమాన్యం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే.. వారు అప్పీలు చేసుకునేందుకు అవకాశం ఉండేది. కొత్త జిల్లాలు ఏర్పాటైనప్పటి నుంచి ఈ ప్రక్రియ ఆగిపోయంది.

దీంతో గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు వందలాది అప్పీల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్టీసీలో ఉన్నప్పుడు పదవీ విరమణ చేసిన 32 వేల మంది ఉద్యోగులకు నెలకు సగటున 3 నుంచి 5 వేల వరకే ఈపీఎఫ్‌ పింఛన్‌ వస్తోంది. విలీనం తర్వాత సర్వీసులో ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పాత పింఛన్‌ వస్తుందని ఆశలు పెట్టుకున్నా.. ఇప్పటికీ దీనిపై స్పష్టత లేదు. ఈపీఎఫ్‌లో హయ్యర్‌ పింఛన్‌కు ఆప్షన్‌ పెట్టుకున్న ఉద్యోగులు భారీ మొత్తం చెల్లించాలంటూ నోటీసులు వస్తున్నాయి. అయితే ఎంత పింఛన్‌ వస్తుందో అందులో పేర్కొనడం లేదు. మొత్తంగా పింఛను విషయంలో ఆర్టీసీ ఉద్యోగుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది..

RTC Employees Bills Peding: లంచం ఇస్తే సరి.. లేకుంటే నెలల తరబడి వేచి చూడాల్సిందే

ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే ఆర్టీసీ ఉద్యోగులకు అనారోగ్య సమస్యలు అధికం. వీరు ఆర్టీసీలో ఉన్నప్పుడు డిస్పెన్సరీల్లో వైద్యంతో పాటు రెఫరల్‌ ఆస్పత్రుల్లో ఖర్చంతా ఆర్టీసీయే భరించేది. ప్రభుత్వంలో విలీనమయ్యాక సరైన వైద్యం అందడం లేదని ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. ఆర్టీసీలో రిటైర్‌ అయిన ఉద్యోగుల పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. విరికి డిస్పెన్సరీల్లో వైద్యం అందించడం లేదు. అలాగే ప్రభుత్వం తరఫున పింఛన్‌ లేకపోవడంతో ఈహెచ్‌ఎస్‌ కార్డులు ఉండటం లేదు. దీంతో సొంత డబ్బులు వెచ్చించి ఆర్థికంగా నష్టపోతున్నారు.

ఆర్టీసీలో 1989 నుంచి సిబ్బంది పదవీ విరమణ ప్రయోజన పథకం ఉండేది. ప్రతినెలా ఉద్యోగి జీతం నుంచి కొంత రికవరీ చేసి దానికి యాజమాన్య వాటాను కూడా జతచేసే వారు. పదవీ విరమణ తర్వాత నెలకు 3,200 వరకు నగదు ప్రయోజనంగా ఇచ్చేవారు. ఉద్యోగి మరణిస్తే జీవిత భాగస్వామికి సగం మొత్తం అందించే వారు. విలీనం తర్వాత సర్వీసులో ఉన్నవారికి ఈ స్కీమ్ వర్తించదని నిలిపేశారు. అదే విధంగా ఉద్యోగుల నుంచి గతంలో రికవరీ చేసిన మొత్తాన్ని సైతం అందరికీ ఇవ్వలేదు. భవిష్యత్తులో ఎవరు ముందుగా పదవీ విరమణ చేయనున్నారో వారికే సెటిల్‌ చేస్తున్నారు.

GOVT TALKS WITH APSRTC UNIONS: విలీనంతో ఆర్టీసీ ఉద్యోగులు అష్టకష్టాలు..పట్టించుకోని ఉన్నతాధికారులు

ఉద్యోగులకు స్టాఫ్‌ బెనిఫిట్‌ ట్రస్ట్‌ పథకం ఉండేది. దీనికి ఉద్యోగం జీతం నుంచి ప్రతినెలా కొంత రికవరి చేసేవారు. సర్వీసులో ఉన్న ఉద్యోగి చనిపోతే ఆ కుటుంబానికి లక్షన్నర రూపాయలతో పాటు అప్పటి వరకు ఈ పథకానికి రికవరీ చేసిన మొత్తాన్ని వడ్డీతో సహా అందించేవారు. ఒకవేళ ఉద్యోగి పదవీ విరమణ చెందితే వడ్డీతో సహా మొత్తం ఇచ్చేవారు. ప్రభుత్వంలో విలీనమయ్యాక 55 ఏళ్లలోపు వారికి ఎస్‌బీటీ నిలిపేసి ఏపీజీఎల్‌ఐసీ వర్తింపజేశారు.

అయితే ఉద్యోగుల నుంచి అంతవరకు రికవరీ చేసిన మొత్తాన్ని అందరికీ ఇవ్వడం లేదు. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి అమల్లోకి వచ్చినప్పుడు నెట్‌ జీతం మాత్రమే ప్రభుత్వం చెల్లించింది. జీతాల నుంచి మినహాయించిన కోపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ రుణ రికవరీ, పీఎఫ్‌ వాటా తదితరాల గ్రాస్‌ మొత్తాన్ని విడుదల చేయలేదు. ఇలా ఇవ్వాల్సిన మొత్తం 100 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. దీనిపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఉలుకుపలుకూ లేదు.

APSRTC Employees Problems: కాగితాల్లోనే బదిలీలు, పోస్టింగులు ఎక్కడివక్కడే అంటున్న ఆర్టీసీ

Last Updated : Oct 3, 2023, 9:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.