కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడుతున్న వైద్యుల సేవలు ప్రశంసనీయమని... గుంటూరు జిల్లా తెనాలి రోటరీ క్లబ్ సభ్యులు అన్నారు. తెనాలి ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం 2020-21 నూతన కార్యవర్గ సభ్యుల నియామక కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులకు 1 లక్ష 70 వేల విలువ చేసే వెయ్యి పీపీఈకిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే శివకుమార్ చేతులు మీదుగా సూపరింటెండెంట్ డాక్టర్ శనత్కుమారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కరోనా వంటి సమయంలో రోటరీ క్లబ్ వారు ముందుకు రావటం అభినందనీయమన్నారు.
ఇదీ చదవండి: డిప్యూటీ స్పీకర్ పద్మారావు జీ.. మాస్క్ ధరించకపోతే ఎలా?