గుంటూరు జిల్లా సత్తెనపల్లి రైల్వేస్టేషన్ రోడ్డులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం చోరీ జరిగింది. సుమారు పదహారు వందల రూపాయల నగదును అపహరించారు. కళాశాలలోని నాలుగు గదుల తాళాలు పగలగొట్టి దుండగులు లోపలకు చొరబడ్డారు. బీరువాలను పగలగొట్టి... రికార్డులను చిందరవందరగా పడేశారు. కళాశాల ప్రిన్సిపల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: